AI Anchor | మన యాంకరమ్మ.. తెర మీద మాట్లాడే బొమ్మా

AI Anchor సాంకేతిక అద్భుతం..జర్నలిస్టులకు సవాల్‌ విధాత: ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌) తెచ్చిన మార్పు మానవ వనరులకు పెను సవాల్ విసురుతుంది. తాజాగా మీడియా రంగంలో ఏఐ సాంకేతిక విజ్ఞానంతో రూపొందిన కృత్రిమ మహిళా యాంకర్ (పేరు లిసా) టీవి తెరపై చకచకా వార్తలు చదువుతుంటే అంతా అచ్చం నిజమైన మహిళా యాంకర్ వార్తలు చదువుతుందనుకుంటున్నారు. ఒడిశా మీడియా సంస్థ చేసిన కృత్రిమ మహిళా యాంకర్ (న్యూస్ రీడర్‌) ప్రయోగం ఇప్పుడు దేశ జర్నలిజం రంగంలో సరికొత్త మార్పులకు […]

  • Publish Date - July 13, 2023 / 12:30 AM IST

AI Anchor

  • సాంకేతిక అద్భుతం..జర్నలిస్టులకు సవాల్‌

విధాత: ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌) తెచ్చిన మార్పు మానవ వనరులకు పెను సవాల్ విసురుతుంది. తాజాగా మీడియా రంగంలో ఏఐ సాంకేతిక విజ్ఞానంతో రూపొందిన కృత్రిమ మహిళా యాంకర్ (పేరు లిసా) టీవి తెరపై చకచకా వార్తలు చదువుతుంటే అంతా అచ్చం నిజమైన మహిళా యాంకర్ వార్తలు చదువుతుందనుకుంటున్నారు. ఒడిశా మీడియా సంస్థ చేసిన కృత్రిమ మహిళా యాంకర్ (న్యూస్ రీడర్‌) ప్రయోగం ఇప్పుడు దేశ జర్నలిజం రంగంలో సరికొత్త మార్పులకు తెరలేపింది.

భారతీయ కట్టు బొట్టుతో నిజమైన మహిళా యాంకర్ రూపంలో ప్రాణం లేని ఏఐ మహిళా యాంకర్ లిసా రానురాను ప్రొఫెషనల్ జర్నలిస్టుల మనుగడను, ఉనికిని, ఉపాధిని సవాల్ చేసే స్థాయికి చేరవచ్చని సాంకేతిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కృత్రిమ మేథాతో రూపొందిన మాట్లాడే బొమ్మా యాంకరమ్మ దేశంలోని అన్ని భాషాల్లోనూ మాట్లాడగలగడటం మరో విశేషం.

అయితే ప్రస్తుతానికి ఒడియా, ఇంగ్లీష్ భాషలలో సదరు మీడియా యాజమాన్యం లిసా యాంకర్‌ను వినియోగిస్తున్నారు. యాంకరింగ్‌, న్యూస్ రీడింగ్ సమయంలో లిసా సందర్భోచితంగా ముఖ కవళికలు, భావోద్వేగాలను, హావభావాలను కూడా వ్యక్తీకరిస్తు ప్రాణమున్న నిజమైన మహిళా యాంకర్‌గానే వ్యవహారిస్తు ప్రేక్షకులను అశ్చర్యానికి గురి చేస్తుంది.

అంతేకాకుండా రియల్ టైమ్‌లో యూజర్ల ప్రశ్నలకు సమాధానాలిస్తు తాజా కబుర్లను కూడా ఎప్పటికప్పుడు చదివేస్తు నిజమైన జర్నలిస్టులకు పోటీగా తయారైంది. దేశంలో తొలిసారిగా టైమ్స్‌ నౌ వెదర్‌ అప్ డేట్‌ కోసం ఏఐ సృష్టియైన కృత్రిమ యాంకర్‌ను వినియోగించారు. తర్వాతా ఆజ్‌ తక్‌, ఒడిశా చానల్‌ ఓ టీవి లిసాను రంగంలోకి దింపింది. ఇప్పుడు టీ న్యూస్‌, బిగ్‌ టీవి చానల్‌ రెండు కూడా ఏఐ యాంకర్‌లను వాడి తెలుగు మీడియాలో సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలికారు.

అయితే సాంకేతిక మాయా బొమ్మా లిసా వంటి కృత్రిమ మహిళా యాంకర్‌తో మహిళా జర్నలిస్టులకే కాదు రానురాను పురుష జర్నలిస్టుల ఉపాధి అవకాశాలకు కూడా గండిపడవచ్చని ఆందోళన వ్యక్తమవుతుంది. ఇందుకు ఉదాహారణంగా ఇటీవల ఏఐ చాట్‌బాట్ రాకతో ఓ బెంగుళూర్ స్టార్టప్ కంపనీ 90 శాతం ఉద్యోగులను ఇంటికి పంపిన ఉదంతం నిదర్శనంగా చెబుతున్నారు. మనుషుల కంటే కూడా ఏఐ సృష్టించిన కృత్రిమ ఉద్యోగులే వేగంగా సమయానుకులంగా పనులు చేస్తుండటం, పలువురు చేసే పని ఒక్కరే చేస్తుండటం వంటి కారణాలతో ఏఐ చాట్‌బాట్ వైపు కంపనీలు ఆసక్తి చూపుతున్నాయి.

ఈ నేపధ్యంలో మీడియా రంగంలో మాట్లాడే బొమ్మ యాంకరమ్మ లిసా ప్రయోగం భవిష్యత్‌లో జర్నలిస్టుల ఉద్యోగ అవకాశాలు సవాల్‌గా మారనుంది. ప్రస్తుతానికి ఏఐ యాంకర్‌ వినియోగ ప్రక్రియ పరిమిత స్థాయిలోనే ఉంటుందని , భవిష్యత్‌లో దాని పరి్ధి, ప్రయోజనాలు విస్తరిస్తే మాత్రం జర్నలిస్తుల ఉద్యోగాలకు ఎసరు తప్పదని నిపుణులు భావిస్తున్నారు.

Latest News