Site icon vidhaatha

కుర్చీలో కేసీఆర్ చిత్ర‌ప‌టంతో.. చెర్ల‌గూడెం భూనిర్వాసితుల వినూత్న నిర‌స‌న‌

విధాత: చెర్ల‌గూడెం ప్రాజెక్టులో భూములు కొల్పోయిన ఖుదాబ‌క్షిప‌ల్లి, రాంరెడ్డిప‌ల్లి, శివ‌న్న‌గూడెం గ్రామాల ప్ర‌జ‌లు వినూత్న నిర‌స‌న తెలిపారు. వారికి న్యాయం చేయాల‌ని 45 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న దీక్ష శిబిరం వ‌ద్ద ఖాళీ కుర్చీ వేసి అందులో కేసీఆర్ చిత్ర‌ప‌టం ఉంచి నిర‌స‌న తెలియ‌జేశారు.

ఏడాదిన్న‌ర‌ కాలంలో భూనిర్వాసితుల స‌మస్య‌లు ప‌రిష్క‌రిస్తాన‌ని చెప్పి ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌ని మండి ప‌డ్డారు. మ‌ల్ల‌న్న సాగ‌ర్ భూ నిర్వాసితుల‌కు రూ. 12 ల‌క్ష‌లు ఇచ్చి చెర్ల‌గూడెం ప్రాజెక్టు భూనిర్వాసితుల‌కు ఎందుకు రూ. 05.05 ల‌క్ష‌లు మాత్ర‌మే ఇచ్చార‌ని ప్ర‌శ్నించారు. అలాగే ముంపు గ్రామాల ప్ర‌జ‌ల‌కు ఉద్యోగాలు ఇస్తామ‌ని చెప్పి ఇప్పుడు ఆ ఊసే ఎత్త‌డం లేద‌ని తెలిపారు.

Exit mobile version