Site icon vidhaatha

మంత్రి మల్లారెడ్డి వాహనాన్ని తనిఖీ చేసిన కేంద్ర బలగాలు.. అసహనం

విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద మంత్రి మల్లారెడ్డి వాహనాన్ని కేంద్ర పారామిలటరీ బలగాలు తనిఖీ చేశారు. ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా మంత్రి గుండ్ల బావిలో ప్రచారం నిర్వహించి ఆరెగూడెం వెళ్తుండగా కేంద్ర బలగాలు తనిఖీ చేశారు. ఆయన వెంట మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి కూడా ఉన్నారు.

వాహనాలు తనిఖీ చేయడంపై మల్లారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. వాహనాల తనిఖీల వల్ల మల్లారెడ్డి ప్రచారానికి కాస్త ఆలస్యం అయ్యింది. మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే.. నియోజకవర్గాన్ని అభివృద్దిలో ముందుకు తీసుకువెళ్తామని ఆయన సూచించారు.

Exit mobile version