Site icon vidhaatha

Insurance Sector | బీమారంగంలో భారీగా పెరిగిన పెట్టుబడులు.. ఎఫ్‌డీఐలు రూ.54వేలకోట్లకు..!

Insurance Sector | భారత్‌లోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్నది. ఓవర్సీస్‌ క్యాపిటల్‌ ఫ్లో రూల్స్‌ను సరళీకరించడంతో గత తొమ్మిదేళ్లలో బీమారంగంలో దాదాపు రూ.54వేలకోట్లను ఎఫ్‌డీఐలు వచ్చాయి. ఈ సమయంలో బీమా కంపెనీల సంఖ్య జనవరి 2024 నాటికి 53 నుంచి 70కి పెరిగింది. ప్రభుత్వం బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి, 2015లో 74 శాతానికి పెంచిందని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి వెల్లడించారు. 2021లో బీమా మధ్యవర్తిత్వ కంపెనీలకు అనుమతించబడిన ఎఫ్‌డీఐ పరిమితిని 2019లో 100 శాతానికి పెంచినట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ చర్యలతో బీమా కంపెనీలు డిసెంబర్‌ 2014 నుంచి జనవరి 2024 వరకు రూ.53వేలకోట్ల విలువైన ఎఫ్‌డీఐలను పొందాయన్నారు.

2013-14లో బీమా కంపెనీల నిర్వహణలో ఉన్న ఆస్తులు (అసెట్‌ అండర్‌ మేనేజ్‌మెంట్‌-AUM) రూ.21.07 లక్షల కోట్లు. ఇప్పుడు దాదాపు మూడు రెట్లు పెరిగి రూ.60.04 లక్షల కోట్లకు చేరుకుంది. మొత్తం బీమా ప్రీమియంలు మార్చి 2014లో రూ.3.94 లక్షల కోట్ల నుంచి రెండింతలు పెరిగి రూ.10.4 లక్షల కోట్లకు చేరాయి. 2013-14లో 3.9 శాతంగా ఉన్న బీమా ఉత్పత్తులు 2022-23లో నాలుగు శాతానికి పెరిగిందని జోషి చెప్పారు. ఈ కాలంలో బీమా డెన్సిటీ 52 డాలర్ల నుంచి 92 డాలర్లకి పెరిగింది. జ్యూరిచ్ ఇన్సూరెన్స్-కోటక్ జనరల్ ఇన్సూరెన్స్ మధ్య ఇటీవలి ఒప్పందం జరిగింది. దీంతో బీమా రంగంలో మరో భారీ ఎఫ్‌డీఐ వచ్చే ఛాన్స్‌ ఉన్నది. ఫిబ్రవరిలో జ్యూరిక్​ ఇన్సూరెన్స్, కోటక్ మహీంద్రా జనరల్ ఇన్సూరెన్స్‌‌లో 70 శాతం వాటాను రూ.5,560కోట్లకు ఒకే విడతలో కొనుగోలు చేయాలని ప్రతిపాదించింది.

Exit mobile version