IRCTC Kerala Tour From Hyderabad | పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. కేరళలో పర్యటించాలనుకునే వారి కోసం తక్కువ ధరల్లోనే ప్యాకేజీని తీసుకువచ్చింది. హైదరాబాద్ నుంచి ప్యాకేజీ మొదలవనున్నది.
‘KERALA HILLS & WATERS’ పేరిట ప్యాకేజీని ప్రకటించగా.. ఐదు రాత్రులు, ఆరు రోజుల పాటు టూర్ కొనసాగుతున్నది. జూన్ 20న టూర్ ప్రారంభంకానున్నది. ఈ పర్యటనలో మున్నార్, అలెప్పీ తదితర పర్యాటక ప్రాంతాలను చుట్టిరావొచ్చు.
పర్యటన సాగుతుంది ఇలా..
Day-1: జూన్ 20న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 12:20 గంటలకు రైలు ప్రయాదం ప్రారంభమవుతుంది. రాత్రంతా ప్రయాణం ఉంటుంది.
Day-2: రెండోరోజు మధ్యాహ్నం 12.55 నిమిషాలకు ఎర్నాకులం రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ్నుంచి మున్నార్ చేరుకొని హోటల్‌లో చెకిన్ అవుతారు. సాయంత్రం మున్నార్ టౌన్‌లో పర్యటన ఉంటుంది. రాత్రి అక్కడే బస ఉంటుంది.
Day-3 : మూడో రోజు ఉదయం ఎర్నాకులం నేషనల్ పార్క్‌ను సందర్శిస్తారు. తర్వాత టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యామ్, ఎకో పాయింట్‌కు వెళ్తారు. రాత్రి మున్నార్‌కు చేరుకొని అక్కడే బస చేస్తారు.
Day-4 : నాలుగో రోజు అలెప్పీకి వెళ్తారు. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత.. బ్యాక్‌వాటార్ ప్రాంతానికి వెళ్తారు. రాత్రి అలెప్పీలోనే బస చేస్తారు.
Day-5 : ఐదో రోజు హోటల్ నుంచి చెక్ అవుట్ తర్వాత ఎర్నాకులం చేరుకుంటారు. ఉదయం 11.20 నిమిషాలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది.
Day-6 : ఆరో రోజు మధ్యాహ్నం 12:20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవటంతో పర్యటన ముగుస్తుంది.
కేరళ టూర్ ధరలు
కేరళ పర్యటనకు సంబంధించి ప్యాకేజీ ధరలు ఇలా ఉన్నాయి. కంఫర్ట్ కేటగిరిలో సింగిల్ షేరింగ్‌కు రూ. 32,230 ధర చెల్లించాల్సి ఉంటుంది. డబుల్ షేరింగ్‌లో రూ.18,740 ధర నిర్ణయించారు. ట్రిపుల్ షేరింగ్‌లో రూ.15,130 ఒక్కొక్కరు చెల్లించాల్సి ఉంటుంది. స్టాండర్డ్ కేటగిరిలో సింగిల్ షేరింగ్‌కు రూ.29,520, ట్విన్ షేరింగ్‌కు రూ.16,040, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.12,420 చెల్లించాల్సి ఉంటుంది.
పిల్లలకు ప్రత్యేకంగా చెల్లించాల్సి ఉంటుంది. కంఫర్ట్ క్లాస్‌లో రైలులో థర్డ్ ఏసీ, స్టాండర్డ్ కేటగిరిలో రైలులో స్లీపర్ క్లాస్ ప్రయాణం ఉంటుంది. పూర్తి వివరాల కోసం www.irctctourism.com వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఐఆర్‌సీటీసీ చూసించింది. ప్యాకేజీలో రైలు టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి.