విధాత: సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించే చిత్రాలను చూస్తే అందులో నేటి సామాజిక పరిస్థితులు, సమస్యలు, వాటికి పరిష్కారాలు.. ఇలా స్ట్రాంగ్ మెసేజ్ అంటూ ఒకటి ఉంటుంది. జెంటిల్మెన్, భారతీయుడు, రోబో, ఒకే ఒక్కడు, శివాజీ వంటి చిత్రాలు దీనికి ఉదాహరణగా చెప్పాలి. ఆయన పెద్దగా మెసేజ్ ఇవ్వని చిత్రం ఏమైనా ఉందా? అంటే ప్రేమికుడు అనే చెప్పాలి. అది కూడా క్యాస్ట్ పరమైన మెసేజ్‌ని ఇస్తుంది.
ఇక ప్రస్తుతం శంకర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో దిల్ రాజు నిర్మాతగా ఓ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడట. పాత రామ్ చరణ్ పాత్ర రాజకీయ నాయకుడు అయితే ప్రస్తుత రామ్ చరణ్ పాత్ర ఎన్నికల కమిషనర్ అని సమాచారం. కాగా ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో రామ్ చరణ్ రాజకీయవేత్తగా, ముఖ్యమంత్రిగా కనిపిస్తాడని అంటున్నారు.
ఇక ఈ సినిమాలో శంకర్ రాజకీయాలకు సంబంధించి ఓ స్ట్రాంగ్ మెసేజ్‌ని ఇవ్వనున్నాడని తెలుస్తోంది. ఒకే ఒక్కడు తరహాలో ఈ చిత్రం ద్వారా ఇచ్చే మెసేజ్ కూడా చాలా బలంగా ఉంటుందట. ప్రస్తుతం అందరూ ఓటుకు నోటు అంటున్నారు. కానీ అలా ఓటుకు నోటు తీసుకుంటే అంటే మన ఓటును మనం అమ్ముకుంటే అది మన పిల్లల భవిష్యత్తును కూడా అమ్ముకున్నట్టే అన్న తరహాలో ఉండబోతుందని సమాచారం.
ప్రస్తుత రాజకీయాలలో ఇలాంటి పోకడలు ఎక్కువయ్యాయి. దాంతో ఈ చిత్రం ద్వారా ఆయన ప్రజలకు బలంగా ఓటును అమ్ముకోవద్దని హెచ్చరించబోతున్నారట. ఆల్రెడీ జనసేన మేము ఎన్నికలలో ఓటర్లకు, ఓటుకు డబ్బులు ఇవ్వం అని చెప్తోంది. దాదాపు జనసేన సిద్ధాంతాన్ని ఇందులో శంకర్ మరింత బలంగా ప్రేక్షకులకు చెప్పనున్నాడని తెలుస్తోంది.