Site icon vidhaatha

IT RIDES | భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు

IT RIDES |

విధాత: భువనగిరి బిఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంటి పైన, కార్యాలయంలో ఏకకాలంలో ఐటీ దాడులు సాగుతుండటం కలకలం రేపింది. హైదరాబాద్ లోని కొత్తపేటలోని ఫైళ్ల ఇంటిపైన, అఫీస్ పైన ఏకకాలంలో 12 చోట్ల ఐటీ బృందాలు సోదాలు కొనసాగిస్తున్నాయి.

హిల్ ల్యాండ్ టెక్నాలాజీస్ కంపెనీ, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్‌లో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. రెండు కంపెనీలకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి భార్య వనితా డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఒకవైపు నియోజకవర్గం పరిధిలో రీజనల్ రింగ్ రోడ్డు నిర్వాసిత రైతులకు సంకెళ్లు వేసిన ఘటన, తన భూములను కాపాడుకునేందుకు అలైన్మెంట్ మార్చారన్న ఆరోపణలతో రాజకీయంగా ఇబ్బంది పడుతున్న ఎమ్మెల్యే పైళ్లకు ఐటీ సోదాలు మరింత సమస్యగా మారిందని భావిస్తున్నారు.

Exit mobile version