Site icon vidhaatha

అది తాగుబోతోళ్ల లొల్లి.. రెక్కీ కాదు..! పవన్ ఫిర్యాదుపై తెలంగాణ పోలీసుల వివరణ

విధాత: నన్ను చంపడానికి కుట్ర జరుగుతోంది. ఎవరెవరో సుపారీలు ఇస్తున్నారు.. ఎవరెవరో కాంట్రాక్ట్ తీసుకుంటున్నారు.. రాజకీయంగా నన్ను అడ్డు లేకుండా లేపేయడానికి పెద్ద ప్లాన్ జరుగుతోంది అంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు ఉత్తవే అని తేలింది.

ప్రజల్లో సానుభూతి కోసమో, మద్దతు కోసమో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచడానికో మొత్తానికి ఏ ఉద్దేశ్యం అయితేనేమి గానీ అప్పట్లో వంగవీటి మోహన రంగాను హత్య చేసినట్లుగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ను సైతం హత్య చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని దీన్ని ఛేదించాలని జనసేన నాయకులు అంటూ వస్తున్నారు.

రెండ్రోజులు క్రిందట హైదరాబాద్‌లోని పవన్ ఇంటి వద్ద అనుమానాస్పదంగా ముగ్గురు కుర్రాళ్ళు తిరి గాడారని, పవన్ ఇంటి వద్ద ఉండే సెక్యూరిటీ సిబ్బందితో గొడవకు దిగారని ఆరోపణ. ఇది ఖచ్చితంగా పవన్ హత్యకు ప్లాన్ అని, వాళ్ళు ఉద్దేశ్యపూర్వకంగా రెక్కీ నిర్వహించారని జనసేన కార్యకర్తలు, నాయకులు ఆరోపిస్తూ వస్తున్నారు.

జిల్లాల్లో అయితే పవన్‌కు భద్రత పెంచాలంటూ కార్యకర్తలు సభలు.. సమావేశాలు పెట్టి గోల చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు పవన్ ఇంటివద్ద ఆగిన కారు, దాన్లోని కుర్రాళ్ళ వివరాలు వాకబు చేయగా వాళ్లంతా ఆకతాయిలని, మద్యం మత్తులో ఇలా అల్లరి చేశారని తేలింది.

అంతే తప్ప వాళ్లేమి కిల్లర్స్.. సుపారీ గ్యాంగ్ కాదని తేటతెల్లమైంది. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు వారికి నోటీసులు ఇచ్చి న్యూసెన్స్ కేసు బుక్ చేశారు. దీంతో అయ్యో హత్యాప్రయత్నం.. రాజకీయ మైలేజీ అంటూ ఏదేదో ఊహించిన జనసేన నాయకులకు ఆశాభంగం ఐనట్లయింది.

Exit mobile version