Revanth Reddy | Congress
- టీఆర్‌ఎస్ గోడలు బద్దలు కొట్టిన ఖమ్మం గడ్డ
- సైకోలు…శివరాన్ బస్సులు ఇవ్వలే.. లారీలు రానీయలే..
- డిసెంబర్ 9 నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్‌దే అధికారం
- ఇదే గడ్డపై విజయోత్సవ సభ
- భట్టి పాదయాత్రలో గుర్తించిన సమస్యన్నీ మానిఫెస్టోలో
- ఖమ్మంలో 10కి పది సీట్లు కాంగ్రెస్‌వే
- మిగతా చోట్ల 80 సీట్లు కాంగ్రెస్‌కు
- పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి
విధాత: తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే కల్వకుంట్ల కుటుంబం కాలనాగై ఈ తెలంగాణను కాల్చుకు తింటుందని పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఖమ్మం జనగర్జన సభలో ఆయన మాట్లాడుతూ ఏపీలో పార్టీని నష్టపోయినా, కేంద్రంలో ఓడిపోయినా, తెలంగాణలో ఇక్కడ ఒడిదుడుకులు వచ్చినా, 60 ఏళ్ల తెలంగాణ ప్రజల పోరాటన్ని గుర్తించిన సొనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు.
సోనియా తెలంగాణ ఇస్తే.. దోచుకు తింటున్న కల్వకుంట్ల కుంటుంబాన్ని అండమాన్ వరకు తరిమి కొట్టాల్సిన బాధ్యత ఇక్కడకు వచ్చిన యువతపై ఉందన్నారు. తెలంగాణ ఉద్యమం1969లో ఇదే ఖమ్మం జిల్లా పాల్వంచలో మొదలైందన్నారు. ఇప్పుడు కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి కలిగించడానికి ఖమ్మం ప్రజలు లక్షలాధిగా తరలి వచ్చారన్నారు.
ఖమ్మం నడిగడ్డపై కాంగ్రెస్ జెండా రెపరెపలాడించడానికి లక్షలాధిగా తరలి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలంద రికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి ఈ రోజు సుధిన మని, తొమ్మిది ఏళ్లుగా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న చీడ పీడను వదిలించడానికి మన నాయకుడు రాహుల్ గాంధీ వచ్చారన్నారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికతో ఖమ్మం జిల్లాలో 10కి 10 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్నారు. ఇక్కడ 10 సీట్లు మీరు గెలుచుకు రండి.. రాష్ట్రంలో 80 సీట్లు మేం తీసుకు వస్తామన్నారు.
We welcome former MP shri Ponguleti Srinivasa Reddy garu & his colleagues into Congress family who joined today in the presence of Shri @RahulGandhi ji.
With this strength we are going to win 10/10 assembly seats from the erstwhile Khammam district in the upcoming polls.… pic.twitter.com/1oy8nv7NoR
— Revanth Reddy (@revanth_anumula) July 2, 2023
టీఆర్‌ఎస్ కట్టిన గొడలు బద్దలు కొట్టుకొని..
ఖమ్మంలో జనగర్జన సభ పెడితే టీఆర్‌ఎస్ సైకోలు, శివరాసన్ బస్సులు ఇవ్వలేదు, లారీలు రానీయలేదని రేవంత్ తెలిపారు. అయినా టీఆర్ ఎస్ కట్టిన గోడలు బద్దలు కొట్టుకొని ఈగడ్డపై కాంగ్రెస్ జెండా ఎగుర వేయడానికి లక్షలాధిగా తరలి వచ్చారన్నారు.
డిసెంబర్ 9వ తేదీన సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రకటన చేశారని, ఈ ఏడాది డిసెంబర్ 9వ తేదీన సోనియా గాంధీకి జన్మదిన కానుకగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందన్నారు. మళ్లీ ఇదేగడ్డపై విజయోత్సవ సభ నిర్వహించుకుందామని అన్నారు. ఈ శంఖారావమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నాంధీ పలుకుతుందన్నారు.
భట్టి తెలుసుకున్న సమస్యలన్నీ మానిఫెస్టోలో…
సీఎల్ పీ నేత మల్లు భట్టి విక్రమార్క 110 రోజులు 1300 కిలో మీటర్ల పైచిలుకు పాదయాత్ర నిర్వహించి, ప్రజలను కలిసి సమస్యలన్నీ తెలుసుకున్నారని రేవంత్ అన్నారు. భట్టి తన పాదయాత్రలో ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యలన్నీ పరిష్కరించాడినికి, వాటన్నింటిని కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టోలో పెడతామని రేవంత్ ప్రకటించారు.
వరంగల్‌లో రైతు డిక్లరేషన్, హైదరాబాద్‌లో యూత్ డిక్లరేషన్, ఖమ్మం గడ్డపై ఇప్పుడు సామాజిక ఫెన్షన్లురూ. 4 వేలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, సంక్షేమాన్ని, అభివృద్దిని రెండు పాదాల మీద నడిపిస్తుందన్నారు.