Site icon vidhaatha

కళాతపస్వీ విశ్వనాథ్‌ సతీమణి జయలక్ష్మి కన్నుమూత

విధాత: ప్రముఖ దర్శకుడు, కళాతపస్వీ కె. విశ్వనాథ్‌ ఇంట మరో విషాదం నెలకొన్నది. విశ్వనాథ్‌ సతీమణి జయలక్ష్మి(86) కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. కొద్దిసేపటికే తుదిశ్వాస విడిచారు.

విశ్వనాథ్‌ ఫిబ్రవరి 2న మరణించిన విషయం విదితమే. ఆయన చనిపోయిన 24 రోజులకే ఆయన సతీమణి మరణించడంతో కుటుంసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

విశ్వనాథ్‌ మృతిచెందినప్పటి నుంచి జయలక్ష్మి తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే గుండెపోటుతో మృతి చెందారు. ఆమె మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Exit mobile version