Site icon vidhaatha

కంటి వెలుగును ప్రారంభించిన న‌లుగురు సీఎంలు

విధాత: తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన కంటి వెలుగు రెండో విడుత కార్య‌క్ర‌మం ఖ‌మ్మం జిల్లా క‌లెక్ట‌రేట్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. తెలంగాణ‌, ఢిల్లీ, పంజాబ్,కేర‌ళ ముఖ్య‌మంత్రులు కేసీఆర్, అర‌వింద్ కేజ్రీవాల్, భ‌గ‌వంత్ మాన్, పిన‌ర‌యి విజ‌య‌న్ చేతుల మీదుగా ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా ఆరుగురుకి కంటి ప‌రీక్ష‌లు నిర్వ‌హించి, క‌ళ్ల‌ద్దాలు పంపిణీ చేశారు. కంటి వెలుగు కార్య‌క్ర‌మం గురించి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా సీఎంలు కంటి వెలుగు బ్రోచ‌ర్‌ను ఆవిష్క‌రించారు.

ఈ కార్య‌క్ర‌మంలో యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్, డీ రాజా, రాష్ట్ర మంత్రులు హ‌రీశ్‌రావు, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, పువ్వాడ అజ‌య్, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి, మ‌ల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌తో పాటు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు. మ‌రికాసేప‌ట్లో ఖ‌మ్మం జిల్లా లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆవిర్భావ స‌భ‌కు హాజరుకానున్నారు.

Exit mobile version