Site icon vidhaatha

TDPలో చేరిన మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్‌

విధాత: ఓటుకు నోటు ఎపిసోడ్ తర్వాత టీడీపీ తెలంగాణ రాజకీయాలకు దూరంగానే ఉంటున్నది ఒకానొక సందర్భంలో తెలంగాణలో టీడీపీ అనేది ఉందా అనే వరకు కూడా వచ్చింది. మునుగోడు ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలలో చేరికలు జరుగుతున్న సమయంలో అనూహ్యంగా టీడీపీలోకి కూడా చేరికలు చోటు చేసుకున్నాయి.

మాజీ ఎమ్మెల్సీ బీసీలలో గట్టి పట్టు ఉన్న బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ తిరిగి శుక్రవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు గౌరవ నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరారు. చంద్రబాబు జ్ఞానేశ్వర్‌కి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఇప్పటికైనా తెలంగాణ తెలుగుదేశంలో తిరిగి నిలదొక్కుకోవచ్చని టీడీపీ ఆశిస్తున్నది.

అయితే జ్ఞానేశ్వర్ కు తెలంగాణ టీడీపీ బాధ్యతలు అప్పగించనున్నారని సమాచారం. ఆయనకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియయమిస్తారనే చర్చ జరుగుతున్నది. ఈ విషయాన్ని రేపు అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది

Exit mobile version