Site icon vidhaatha

ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి కన్నుమూత

విధాత, సినిమా: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి కాసేపటి క్రితం కన్నుమూశారు. చెన్నై నీలాంగరై లో తన నివాసం నేటి రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాలకు తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో టాలీవుడ్ విషాదంలో నెలకొంది. ఆయన తన కెరీర్‌లో ఎన్నెన్నో క్లాసిక్ చిత్రాలను తెరకెక్కించారు. ఎన్నో సంచలనాత్మక సినిమాలు నిర్మించారు కాట్రగడ్డ. యువచిత్ర బ్యానర్​పై నిర్మించిన చాలా సినిమాలు విజయాలను సొంతం చేసకున్నాయి.

గోరింటాకు సహా పలు చిత్రాలకు కాట్రగడ్డ నిర్మాతగా ఉన్నారు. నారీ నారీ నడుమ మురారి, శ్రీనివాస కల్యాణం వంటి హిట్​ మూవీస్​కు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. కాట్రగడ్డ మురారి మరణ వార్త తెలిసిన సినీరంగ ప్రముఖులు మురారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సీతారామ కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం, జానకీ రాముడు, నారీ నారీ నడుము మురారి అనే చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మీద తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు మురారి. అంతేకాకుండా ఆయన తన జీవిత చరిత్ర ఆధారంగా రాసుకున్న ఆత్మకథలో సినిమా పరిశ్రమలోని చీకటి కోణాలను కూడా రచించారు.

Exit mobile version