Site icon vidhaatha

Thummala Nageshwara Rao| తుమ్మలకు ఎమ్మెల్సీ ఆఫర్‌.. మూడు స్థానాల్లో ఒకటి ఆయనకే ఖరారు

రేపు హైదరాబాద్‌లో అందుబాటులో ఉండాలని సీఎం నుంచి తుమ్మలకు కబురు

విధాత: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టున్న నేత తుమ్మల నాగేశ్వర్‌రావు (Thummala Nageshwara Rao) కు కేసీఆర్‌కు దశాబ్దాలుగా సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో జరగనున్న 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఆపార్టీలో పెద్ద లిస్టే ఉన్నది.

అయితే అనేక రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని మాజీ మంత్రి తుమ్మల వైపే కేసీఆర్‌ మొగ్గు చూపినట్టు సమాచారం. మూడు స్థానాల్లో ఒకటి తుమ్మలకు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 3న రాత్రి కల్లా హైదరాబాద్‌లో అందుబాటు ఉండాలని సీఎం నుంచి తుమ్మలకు కబురు అందినట్టు సమాచారం.

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ brs కు దూరమై పార్లమెంటు స్థానంతో పాటు పది అసెంబ్లీ స్థానాల్లో తన అభ్యర్థులను దించుతానని ప్రకటించి అధికారపార్టీకి సవాల్‌ విసిరారు. 2014, 2018 లో రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ హవా రాష్ట్రమంతటా కొనసాగినా ఖమ్మం జిల్లాలో మాత్రం ఒక్క స్థానానికే పరిమితమైంది.

ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోనే బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభ అక్కడే నిర్వహించారు. తాజాగా తుమ్మలకు ఎమ్మెల్సీ ఆఫర్‌ చేసి తద్వారా కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ, పొంగులేటి ఇలా అందరికీ చెక్‌ పెట్టాలని కేసీఆర్‌ భావిస్తున్నారు.

Exit mobile version