Site icon vidhaatha

నన్ను డ్యామేజ్ చేసేందుకే KCR అలా మాట్లాడారు: ఈటల కౌంటర్

ఇబ్బంది పెట్టేందుకే నా పేరు ప్రస్తావించారు..

విధాత: శాసనసభ సమావేశాల ముగింపు రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో పదే పదే తన పేరును ప్రస్తావించడంపై ఈటెల రాజేందర్ రియాక్ట్ అయ్యారు. తనను డ్యామేజ్ చేసే వ్యూహంతోనే కేసీఆర్ అలా మాట్లాడారని ఈటెల నిర్వేదం వ్య‌క్తం చేశారు.

కేసీఆర్ పిలిచినా బీఆర్ఎస్‌లోకి పోనని, ఈటల రాజేందర్ కేసీఆర్ మెతక మాటలకు పడిపోడని అన్నారు. 2004లో కూడా వైఎస్‌తో కలుస్తారని ఆపరేషన్ ఆకర్ష్‌లో ఉన్నానన్నారు. నేను ఆనాడు పోలేదు ఇవ్వాళ కూడా పోనని స్పష్టం చేశారు.

నాపై కేసీఆర్ చేసిన దాడి, ఖర్చు,పెట్టిన ఇబ్బంది ప్రజలు మర్చిపోలేదని, పలకరించుకుంటే, పక్కన కూర్చుంటే పార్టీలు మారనని కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. పార్టీలు మారే కల్చర్ ఉన్న వ్యక్తి ఈటల రాజేందర్ కాడని, నేను బీఆర్ఎస్ పార్టీ వీడలేదని వారే నన్ను బయటకు పంపారన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పిలిస్తే కచ్చితంగా పోతానన్నారు.

మా.. ఈటల రాజేందర్: CM KCR! 2 గంటల ప్రసంగంలో 12 సార్లు ప్రస్తావన

7రోజులే నిర్వ‌హించ‌డం ఇదే ప్ర‌థ‌మం..

కెసిఆర్ సభలో ఉండడంతో ప్రజా సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేశాను, వాటి పరిష్కారం కోసమే సభలో ప్రస్తావించానన్నారు. ఉమ్మడి ఏపిలో బడ్జెట్ సమావేశాలు 45 పని దినాలు సభ జరిగేదని, ఆ మాదిరే జరపాలని కోరారు. 7 రోజుల పాటు సభ జరపడం ఇదే ప్రథమమని, తనకు ఇచ్చిన స్వల్ప సమయంలో ఏడు ప్రశ్నలు మాత్రమే వేశానని అన్నారు.

మంద బ‌లంతో స‌భ నిర్వ‌హ‌ణ‌..

ప్రజా సమస్యల పరిష్కారానికి అసెంబ్లీ మంచి వేదిక అని, ప్రజలు న్యాయ నిర్ణేతలుగా ఉంటారన్నారు. మంద బలంతో సభను నడిపించారని, ఇరు పక్షాల వాదనలు ఉంటే బాగుండేదన్నారు. సభను చూసి ప్రజలు నమ్ముతారని కెసిఆర్ భావిస్తున్నారని, ప్రజలకంతా ఎవరేంటో తెలుసని ఈటల అన్నారు.

నా బతుకంతా తెలంగాణ అని చెప్పిన కేసీఆర్ ఎస్సాస్పీ నుంచి, ఆ పై నది నుంచి నీటిని ఎత్తి పోసుకునే వెసులుబాటు కల్పిస్తామని అనడంతో ఉత్తర తెలంగాణ రైతాంగంలో ఆందోళన నెలకొన్నదన్నారు. దీనిపై కేసీఆర్ స్పష్టత ఇవ్వాలన్నారు.

కూలగొడితే కాళ్లు, రెక్కలు విరిచేస్తా: CM KCR

ఏ ప్ర‌భుత్వ ఉద్యోగి సంతోషంగా లేడు..

ధరణి ఫోర్టల్ కారణంగా రైతులు, భూమి యజమానులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, గ్రామాలకు రెవెన్యూ అధికారులను పంపించి పరిష్కరించాలన్నారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా సంతోషంగా లేరని, ఇంకా అనేక జిల్లాల్లో జీతాలు (ఫిబ్రవరి 12వ తేదీ) చెల్లించలేదన్నారు. మోదీని తిట్టడానికే సభ పెట్టుకున్నారని, దేశంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు.

టీఆర్ఎస్ నుంచి వెళ్లిన ఈటల బీజేపీలో చేరి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపొందాడని, ప్రస్తుతం బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌గా ఈటల వ్యవహరిస్తున్నారు. తనను అసెంబ్లీలో మాట్లాడనివ్వడం లేదని, బీజేపీ సభ్యులు కూర్చునేందుకు కూడా అసెంబ్లీలో ఛాంబర్ కేటాయించడం లేదని, భోజనం చేయడానికి కూడా ఇబ్బందిగా ఉందని, మూరినల్స్‌ కోసం కాంగ్రెస్ శాసనసభా నాయకుడి ఛాంబర్‌కు వెళ్లాల్సి వస్తుందని మీడియా ముందు వాపోయిన విషయం తెలిసిందే. ఇవాళ కేసీఆర్ చేసిన వ్యాఖ్యల వెనక బలమైన కారణం ఉండవచ్చనే చర్చ జరుగుతోంది.

ముగిసిన అసెంబ్లీ సమావేశాలు.. 8 రోజులు, 56 గంటలు, 38 ప్రశ్నలు, 5 బిల్లులు

Exit mobile version