IRCTC Scam | రైలు టికెట్‌ క్యాన్సల్‌ చేయబోతే రూ.4లక్షలు టోకరా.. సైబర్‌ నేరగాళ్ల వలలో రిటైర్డ్‌ ఇంజినీర్‌..!

IRCTC Scam | ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌ మోసాలు విపరీతంగా పెరిగాయి. సామాన్యులతో పాటు ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగులను సైతం సైబర్‌ నేరగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని.. కష్టపడి సంపాదించిన సొమ్మును బ్యాంకు ఖాతాల నుంచి ఊడ్చేస్తున్నారు. తాజాగా కేరళ కోజికోడ్‌కు చెందిన మహ్మద్‌ బషీర్‌ (78) అనే వృద్ధుడు ఐఆర్‌సీటీసీకి చెందిన ఫేక్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసి.. రూ.4లక్షల మోసపోయాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. బషీర్‌ మస్కట్‌లో […]

  • Publish Date - August 14, 2023 / 03:45 AM IST

IRCTC Scam |

ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌ మోసాలు విపరీతంగా పెరిగాయి. సామాన్యులతో పాటు ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగులను సైతం సైబర్‌ నేరగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని.. కష్టపడి సంపాదించిన సొమ్మును బ్యాంకు ఖాతాల నుంచి ఊడ్చేస్తున్నారు. తాజాగా కేరళ కోజికోడ్‌కు చెందిన మహ్మద్‌ బషీర్‌ (78) అనే వృద్ధుడు ఐఆర్‌సీటీసీకి చెందిన ఫేక్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసి.. రూ.4లక్షల మోసపోయాడు.

ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. బషీర్‌ మస్కట్‌లో ఇంజినీర్‌గా పని చేసి రిటైర్డ్‌ అయ్యారు. గతంలో రైలు టికెట్‌ను బుక్‌ చేసుకున్నాడు. దాన్ని కాన్సిల్‌ చేసుకునేందుకు ఐఆర్‌సీటీసీకి చెందిన అధికారిక మొబైల్‌ యాప్‌ను కాకుండా.. ఫేక్‌ ఐఆర్‌సీటీసీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు.

బషీర్‌ నకిలీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసిన వెంటనే ఆయన మొబైల్‌ నంబర్కి రైల్వే ఉద్యోగి పేరుతో సైబర్‌ నేరగాళ్లు ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. అయితే, మాట్లాడేది రైల్వే ఉద్యోగులేనని భావించిన బషీర్‌.. నేరగాళ్లు చెప్పివన్నీ చేస్తూ వచ్చాడు.

దీంతో బషీర్‌ ఫోన్‌ను మోసగాళ్లు హ్యాక్‌ చేశారు. బషీర్‌ రైల్వే ఉద్యోగుల పేరుతో ఫోన్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లకు తన బ్యాంకు వివరాలతో పాటు ఏటీఎం వివరాలను చెప్పాడు. దాంతో సైబర్‌ నేరగాళ్లు బషీర్‌ ఫోన్‌లోకి ఓ మాల్వేర్‌ను పంపి.. అందులోని బ్యాకింగ్‌ సమాచారాన్ని దొంగిలించారు.

ఆ తర్వాత సేవింగ్‌ అకౌంట్‌ నుంచి రూ.4లక్షలు విత్‌డ్రా అయినట్లు మొబైల్‌కి ఎస్‌ఎంఎస్‌ రావడంతో తాను మోసపోయానని గ్రహించిన బషీర్‌.. అకౌంట్‌లోని మిగితా డబ్బు మోసగాళ్ల చేతికి వెళ్లకుండా తన మొబైల్‌ను ఫార్మాట్‌ చేసి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బషీర్‌ రెస్ట్‌ డెస్క్‌ నకిలీ యాప్‌ ద్వారా బషీర్‌ ఫోన్‌ను హ్యాక్‌ చేసినట్లు గుర్తించారు.

అయితే, తతంగం అంతా కోల్‌కతా కేంద్రంగా జరిగిందని, బషీర్‌కి వచ్చిన ఫోన్‌కాల్స్‌ అనీ బిహార్‌, కోల్‌కతా నుంచి వచ్చాయని పోలీసులు పేర్కొన్నారు. సైబర్‌ నేరగాళ్లు వృద్ధులు, అమాయక వ్యక్తులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు పేర్కొన్నారు. సైబర్‌ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరు ఫోన్‌ చేసిన బ్యాంకుకు సంబంధించిన వివరాలను చెప్పొద్దని సూచిస్తున్నారు.

Latest News