విధాత, హైదరిబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అ.ని.శా కోర్టు జడ్డి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సైబరాబాద్ పోలీసులు వేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.
కాగా.. ముగ్గురు నిందితులు 24 గంటల పాటు హైదరాబాద్‌ను విడిచి కూడదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిందితుల నివాస ప్రాంత వివరాలను పోలీసు కమిషనర్‌కు ఈరోజు సాయంత్రంలోపు తెలపాలని ఆదేశించింది. ఈ కేసులో ఫిర్యాదు చేసిన రోహిత్‌రెడ్డితో పాటు సంబంధం ఉన్న ఇంకెవరితోనూ ఎలాంటి సంప్రదింపులు చేయవద్దని ఆదేశించింది.