Site icon vidhaatha

Kodanda Reddy | ప్రశ్నిస్తే.. రైతులకు బేడీలా?: కోదండ రెడ్డి

Kodanda Reddy | విధాత: ఆర్ఆర్ఆర్ విషయంలో రైతులు ప్రశ్నిస్తే బేడీలు వేసిన దుర్మార్గపు ప్రభుత్వమని.. కేసీఆర్ పాలనపై జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ తీరుతో రాష్ట్రంలో రైతులు బజారున పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఖమ్మంలో గిట్టు బాటు ధరకు పంట కొనాలి అన్న రైతులకి బేడీలు వేసిన కేసీఆర్… ప్రస్తుతం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రైతులని రెచ్చగొడుతున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తరువాత కిసాన్ కాంగ్రెస్ నిరంతరం రైతుల కోసం పనిచేస్తుందని తెలిపారు.

28న రాష్ట్రస్థాయి కిసాన్ కాంగ్రెస్ సమావేశం

కిసాన్ కాంగ్రెస్ రాష్ట్రస్థాయి సమావేశాన్ని ఆదివారం హైదరాబాద్ లోని గాంధీభవన్‌లో నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి పత్రికా ప్రకటనలో తెలిపారు. సోమ‌వారం ఉదయం 10 గంటలకు జరిగే సమావేశంలో దళితుల భూములు, ధరణి తో భూ హక్కులు కోల్పోయిన అంశం, పంట నష్టం పై చర్చ జరుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యఅతిథులుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఠాక్రే తో పాటు జిల్లా, మండల కిసాన్ కాంగ్రెస్ నేతలు, రైతులు, బాధితులు పాల్గొంటారని తెలిపారు.

Exit mobile version