Site icon vidhaatha

KOMATIREDDY | రాజీనామాలకు కాంగ్రెస్ ఎంపీలు సిద్ధం: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

విధాత: అనర్హత వివాదంలో రాహుల్ గాంధీకి మద్దతుగా న్యాయం కోసం కాంగ్రెస్ ఎంపీలు అంతా రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారని సీనియర్ నాయకులు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ చేపట్టిన దీక్షలో ఆయన మాట్లాడుతూ సోనియా, ఖర్గేలు ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధమన్నారు.

కేంద్రం పెద్ద తప్పు చేసిందని, రాహుల్ కు మద్దతుగా పదవులను వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాహుల్ గాంధీ రెండుసార్లు ప్రధాని ఛాన్స్ వదులుకున్న గొప్ప నాయకుడన్నారు. పార్లమెంట్లో ఆదాని సమస్యలను మళ్లీంచేందుకే రాహుల్ పై వేటు వేశారని వెంకటరెడ్డి ఆరోపించారు.

ఈ దీక్షలో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో పాటు సీనియర్లు కే. జానారెడ్డి, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డిలు, షబ్బీర్ అలీ , రేణుక చౌదరి, వి హనుమంతరావు, పొన్నల లక్ష్మయ్య, అంజన్ కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్ ,సీతక్క హాజరయ్యారు.

Exit mobile version