Site icon vidhaatha

రాహుల్‌జీ కాంగ్రెస్ జోడో యాత్ర చేయండి: KTR

విధాత‌, హైద‌రాబాద్‌: భార‌త్ జోడో యాత్ర చేప‌ట్టిన రాహుల్ గాంధీపై టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేస్తూ.. బీజేపీ, కాంగ్రెస్‌పై ధ్వ‌జ‌మెత్తారు. మోదీని, రాహుల్‌ను ఏకిపారేశారు.

భార‌త్ జోడో యాత్ర కాకుండా కాంగ్రెస్ జోడో యాత్ర చేప‌డితే బాగుంటుంద‌ని రాహుల్‌కు కేటీఆర్ సూచించారు. తెలంగాణ‌లో ఎన్ని రోజులైనా యాత్ర చేసుకోవ‌చ్చు. క‌నీసం అప్పుడైనా టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు ఆయ‌న‌కు తెలిసి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నారు.

ఇవాళ దేశంలో రాజ‌కీయ శూన్య‌త ఏర్ప‌డింద‌న్నారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న కాంగ్రెస్ ఘోరంగా విఫ‌ల‌ం అయింద‌న్నారు. రాహుల్ పాద‌యాత్ర చేస్తుంటే.. ఆ పార్టీకి చెందిన గోవా ఎమ్మెల్యేలు బీజేపీలో చేరార‌ని గుర్తు చేశారు. రాహుల్ తెలంగాణ‌లో పాద‌యాత్ర చేసే స‌మ‌యంలో ఆ పార్టీ ఎంపీలు కాంగ్రెస్‌ను వీడనున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయ‌ని తెలిపారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అట్ట‌ర్ ఫ్లాప్ అయింద‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

Exit mobile version