Site icon vidhaatha

ఇక్క‌డ్నేమో గుండ్లు.. అక్క‌డ్నేమో బోర్డులు: మంత్రి కేటీఆర్‌

విధాత: తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్క‌డ్నేమో గుండ్లు.. అక్క‌డ్నేమో బోర్డులు.. ఎంత చిల్ల‌ర అంటే న‌వ్వాలో, ఏడ్వాల్నో కూడా తెల్వ‌దు. నిజంగా కొట్లాడుదామంటే ఇది వ‌ర‌కు మ‌న‌కు మంచిగా ఉండే. ఇది వ‌ర‌కు మ‌న‌కు ప్ర‌త్య‌ర్థులు మంచిగా ఉండే. చంద్ర‌బాబు, రాజ‌శేఖ‌ర్ ఉండే. వారితో కొట్లాడిన గ‌మ్మ‌త్తు ఉండే. వాళ్లు కూడా ఒక స్థాయి లీడ‌ర్లు కాబ‌ట్టి. వారితో ఓ మాట అన్న‌, ఓ మాట ప‌డ్డ ఒక ప‌ద్ధ‌తి ఉండే. ఇప్పుడు ఉన్న వారితో అయితే ఆగం ఉంది.

ఎలాంటి బ‌ఫూన్ గాళ్ల‌ను మ‌న‌కు త‌గిలించారంటే. కొట్లాట చేత కాదు, మాట్లాడ‌టం చేత కాదు, తెలంగాణ‌కు ఒక్క రూపాయి తెచ్చే తెలివి లేదు. సొంత పార్ల‌మెంట్‌లో అర పైసా ప‌ని కూడా చేయ‌లేదు. ఎంత చిల్ల‌ర రాజ‌కీయం అంటే.. కేసీఆర్ క్షుద్ర పూజ‌లు చేస్తున్నడంట‌. న‌ల్ల పిల్లిని ముందు పెట్టుకొని పూజ చేస్తున్నాడ‌ట‌.

తెలంగాణ రాక ముందు మీరంతా ఉస్మానియా, పాల‌మూరు, కాక‌తీయ మ‌హాత్మాగాంధీ యూనివ‌ర్సిటీల్లో వీరోచితంగా పోరాటం చేసిన స‌మ‌యంలో ఈ బ‌ఫూన్ ఎక్క‌డా క‌న‌బ‌డ‌లేదు. కేసీఆర్ లేక‌పోతే టీఆర్ఎస్ లేదు. టీఆర్ఎస్ లేక‌పోతే ఈ ద‌ఫా తెలంగాణ ఉద్య‌మం లేదు. ఉద్య‌మంలో మీరంతా లేక‌పోతే తెలంగాణ వ‌చ్చుడే లేదు. ఈ తెలంగాణ రాక‌పోతే టీ బీజేపీ, టీ కాంగ్రెస్ ఉండేవి కావు. మీరు పెట్టిన భిక్ష‌నే ఆ ప‌ద‌వులు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, వాసుదేవ రెడ్డి, బాల్ రాజ్ యాదవ్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దిన్, మరియు టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు,విద్యార్థి యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Exit mobile version