Site icon vidhaatha

KTR | టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీలో రాజకీయ కుట్ర: మంత్రి కేటీఆర్

విధాత: టీఎస్‌పీఎస్సీ పేప‌ర్ లీకేజీలో కేసులో ఎవ‌ర్నీ వ‌దిలిపెట్టం.. క‌ఠినంగా శిక్షిస్తామ‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ హెచ్చ‌రించారు. పార‌ద‌ర్శ‌కంగానే టీఎస్‌పీఎస్సీ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తుంద‌ని, ఈ విష‌యంలో యువ‌త‌కు ఎలాంటి అనుమానం అవ‌స‌రం లేద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇది సిస్టం ఫెయిల్యూర్ కాదు.. ఇద్ద‌రు వ్య‌క్తులు మాత్ర‌మే చేసిన త‌ప్పు అని కేటీఆర్ పేర్కొన్నారు. టీఎస్‌పీఎస్సీ పేప‌ర్ లీకేజీ వ్య‌వ‌హారంలో సీఎం కేసీఆర్‌తో ఉన్న‌త‌స్థాయి స‌మావేశం ముగిసిన అనంత‌రం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ఈ ఎనిమిదిన్న‌రేండ్ల‌లో ఇండియాలోనే అత్య‌ధికంగా ఉద్యోగాల నియామ‌కం జ‌రిపిన క‌మిష‌న్ టీఎస్‌పీఎస్సీ అని కేటీఆర్ తెలిపారు. గ‌తంలో ఏపీపీఎస్సీపై అనేక ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. టీఎస్‌పీఎస్సీ ఇప్ప‌టి వ‌ర‌కు 30 వేలకు పైగా ఉద్యోగాలు భ‌ర్తీ చేసింది. ఒక్క ఆరోప‌ణ కూడా రాలేద‌న్నారు. టీఎస్‌పీఎస్సీలో ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పుల వ‌ల్ల‌ మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వచ్చింద‌న్నారు.

రాష్ట్ర యువతకు నమ్మకం కల్పించాల్సిన బాధ్యత మాపై ఉంది అని కేటీఆర్ తెలిపారు. ప్రవీణ్, రాజశేఖర్ వెనకాల ఎవరు ఉన్నా వాళ్ళ పై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇది సిస్టం ఫెయిల్యూర్ కాదు.. ఇద్దరు వ్యక్తులు మాత్రమే చేసిన తప్పు అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకునే భాద్యత మాపై ఉందన్నారు. మళ్ళీ ఇలాంటి పొరపాట్లు మళ్ళీ కాకుండా పూర్తి చర్యలు తీసుకుంటాం అని స్ప‌ష్టం చేశారు.

గ‌తంలో ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారంతా అర్హులే..

రద్దు అయిన పరీక్షలకు ఫీజు కట్టిన యువత మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదని కేటీఆర్ తెలిపారు. గతంలో ద‌ర‌ఖాస్తు చేసుకున్న వాళ్లంతా అర్హులే అని స్ప‌ష్టం చేశారు. పరీక్షల మెటీరియల్ అంతా ఆన్‌లైన్‌లో పెడతాం…ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని సూచించారు. స్టడీ సర్కిల్స్ ను బలోపేతం చేస్తామ‌న్నారు. రీడింగ్ రూమ్స్ 24 గంటలు అందుబాటులో ఉంటాయి. పిల్లలకు భోజన వసతి ఫ్రీగా అందించబోతున్నాం అని ప్ర‌క‌టించారు.

రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌ల‌ను యువ‌త ప‌ట్టించుకోవ‌ద్దు..

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు మాత్రమే అని మ‌రోసారి కేటీఆర్ ఉద్ఘాటించారు. రాజకీయ నిరుద్యోగులు చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యలను యువత పట్టించుకోవద్దు. అపోహలు, అనుమానాలు యువత నమ్మొద్దు అని సూచించారు.

రాజ‌శేఖ‌ర్ రెడ్డి బీజేపీ కార్య‌క‌ర్త‌..

టీఎస్‌పీఎస్సీలో నిందితుడు అయిన రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి బీజేపీ కార్యకర్త అని కేటీఆర్ మీడియాకు వెల్ల‌డించారు. రాజశేఖర్ రెడ్డి వెనుకాల ఎవరైనా ఉన్నారా అనేది విచారణ చేయాలని డీజీపీకి ఫిర్యాదు చేశామ‌ని తెలిపారు. ప్ర‌భుత్వం నోటిఫికేషన్లు ఇస్తుంటే.. బండి సంజయ్ కుట్ర అన్నారు అని గుర్తు చేశారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే కుట్ర ఏమైనా ఉందా అనే అనుమానాలు ఉన్నాయని కేటీఆర్ అన్నారు.

Exit mobile version