విధాత: హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం మంత్రి కేటీఆర్ చేస్తున్న ప్రశంసనీయం. అయితే హైదరాబాద్ ఈస్ట్‌ను కూడా మంత్రి పట్టించుకుంటే బాగుంటుందని ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు. ముఖ్యంగా ఉప్పల్ నుంచి నారపల్లి వరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు నాలుగేళ్లుగా నడుస్తున్నాయి. ఈ పనుల కారణంగా రోడ్లన్నీ అధ్వాన్నంగా మారిపోయాయి.
నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో రోడ్లు సరిగా లేకపోవడం వల్ల విపరీమైన దుమ్ముతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ దుమ్ము కాలుష్యం వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.
రోడ్ల వెడల్పు మంచిదే. అయితే ఈ పనులు వేగవంతంగా పూర్తికాకపోవడం, ఉన్న రోడ్లు ధ్వంసం చేయడం వల్ల నాలుగేళ్లుగా ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు నరకం చూస్తున్నారు.
కాబట్టి మంత్రి గారు ఈ ఏరియాపై దృష్టి సారించాలి. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న నేషనల్ హైవే ప్రాజెక్టు అయినప్పటికీ ప్రజల ఇబ్బందుల ను రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున కేంద్రం దృష్టికి తీసుకుని రావాలని కోరుతున్నారు.
ఒకసారి హైదరాబాద్ ఈస్ట్ పర్యటనకు వస్తే క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుస్తాయని స్థానికులు కోరుకుంటున్నారు. అలాగే మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ సమస్యను పార్లమెంట్‌లో ప్రస్తావించాలని జనం డిమాండ్ చేస్తున్నారు.