Site icon vidhaatha

Union Budget | 1947 త‌ర్వాత పార్ల‌మెంట్‌లో ప్ర‌ప్ర‌థ‌మ ఘ‌ట్టం ఇదీ..

Union Budget | దేశ భ‌విష్య‌త్ ఆదాయ‌, వ్యయాల‌కు సంబంధించి ప్ర‌తి ఏడాది కేంద్రం బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే స్వాతంత్య్రం సిద్ధించిన త‌ర్వాత బ‌డ్జెట్ స‌మ‌ర్ప‌ణ‌కు సంబంధించి ఎన్నో విశేషాలు, మ‌రెన్నో రికార్డులు ఉన్నాయి.

1947-48 ఆర్థిక సంవ‌త్స‌రానికి గానూ అధికార పార్టీ వ్య‌క్తి కాకుండా, బ్రిటీష్‌కు అనుకూలంగా ఉన్న జ‌స్టిస్ పార్టీ నేత ఆర్‌కే ష‌ణ్ముగం చెట్టి బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. అప్ప‌ట్లో బ‌డ్జెట్‌ను సాయంత్రం 5 గంట‌ల‌కు ప్ర‌వేశ‌పెట్టేవారు. ఇప్పుడేమో ఉదయం 11 గంట‌ల‌కు ప్ర‌వేశ‌పెడుతున్నారు. ప్ర‌స్తుతం పేప‌ర్ లెస్ బ‌డ్జెట్‌ను స‌భ‌లో ప్ర‌వేశ‌పెడుతున్నారు. ఇలా ఎన్నో విశేషాలు, ప్ర‌త్యేక‌త‌లు ఉన్న కేంద్ర బ‌డ్జెట్.. ఇప్పుడు కూడా మ‌రో విశేషానికి తెర లేప‌నుంది.

ఆ ప్ర‌త్యేక విశేషం ఏంటంటే.. మ‌హిళా రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ప్రారంభించిన పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల్లోనే.. మ‌హిళా ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డ‌మే. దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత ఇలాంటి సంద‌ర్భంగా ఆవిష్కృతం కావ‌డం ఇదే తొలిసారి.

ఈ విష‌యాన్ని బెంగ‌ళూరు సెంట్ర‌ల్ బీజేపీ ఎంపీ మోహ‌న్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో వెల్ల‌డించారు. ప్ర‌ధాని మోదీ పాల‌న‌లోని స‌రికొత్త ఇండియాకు గ‌ర్వ‌కార‌ణ‌మైన సంద‌ర్భం ఇది అని ఆయ‌న పేర్కొన్నారు.

Exit mobile version