కొడుకుల్ పుట్టరటంచు నేడ్తు రవివే కుల్ జీవనభ్రాంతులై!
కొడుకుల పుట్టరె కౌరవేంధ్రునకనేకుల్,వారిచే నేగతుల్
పడసెన్? పుత్రులులేని యా శకునకున వాటిల్లెనే దుర్గతుల్
చెడునే మోక్షపదం బపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వరా!
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా!లోకంలో కొందఱు కొడుకుఅను కనలేక పోతిమి అని భాదపడెదరు. దృతరాష్ట్రునికి వందమంది పుత్రులు పుట్టలేదా?వారివలన యే సద్గతులు ఆయనకు కల్గినవి?పుత్రులులేని శుక మహర్షికి దుర్గతులు కల్గలేదు గదా!పుత్రులు లేని వారికి మోక్షము లభ్యము కాదా?అనగా పుత్రులు లేకపోయినను ముక్తిని పొందవచ్చును అని భావము.
అప్పుడెప్పుడో వందల ఏళ్ల క్రిందట ధూర్జటి మహాకవి విరచితమైన కాళహస్తీశ్వర శతకంలో చెప్పిన అంశాలు ముమ్మాటికీ నిజమేనని మరోమారు రుజువైంది. తల్లిదండ్రులు లోకానికి ఎలాంటి వారైనా తమ బిడ్డలకు మాత్రం దైవ సమానులే. అందుకే తనకు జన్మనిచ్చిన దేవుడు లాంటి తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ రుణం తీర్చుకునేందుకు, ఆయన ప్రాణం కాపాడేందుకు తన ప్రాణం అడ్డు వేసింది రెండో కూతురు రోహిణి.
తనకు జీవితాన్నిచ్చిన తండ్రికి కిడ్నీ ఇవ్వలేనా అంటూముందుకు వచ్చి తన కిడ్నీని దానం చేసింది.74 ఏళ్ల లాలూ ప్రసాద్ కిడ్నీ ఫెయిల్ అవడంతో దాన్ని మార్చాల్సి వచ్చింది. సింగపూర్ లో ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. లాలూ, రబ్రీదేవి దంపతులకు మొత్తం 9మంది పిల్లలు. పిల్లలు. వారిలో ఎవరి కిడ్నీ సరిపోయిందో లేదో తెలీదు.. ఒకవేళ సరిపడినా, ఇవ్వడానికి వాళ్ళెవరూ ముందుకి రాలేదేమో మరి. 43 ఏళ్ల డాక్టర్. రోహిణి తానే ముందుకు వచ్చి తండ్రికి కిడ్నీ ఇచ్చింది.
తనకు ఇంకా బోలెడు జీవితం ఉంది. ఇలా కిడ్నీ దానం చేయడం వల్ల తనకు మున్ముందు పలు సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నా, ఆమె అవేమి ఆలోచించకుండా తండ్రి ప్రాణాలకే ప్రాధాన్యం ఇచ్చింది. లాలూకు తల్లిదండ్రులు జన్మనివ్వగా ఇప్పుడు కూతురు రెండోసారి ప్రాణం పోసి తల్లిగా మారింది. ప్రేమగా లాలిస్తోంది..
गरीबों के मसीहा, @laluprasadrjd जी ने एक और जंग जीत ली!
सफल ऑपरेशन के पश्चात आदरणीय लालू जी और बहन रोहिणी आचार्य जी, दोनों सुरक्षित हैं!#LaluPrasadYadav pic.twitter.com/KyEALR1e5V
— RJD Overseas (@OverseasRJD) December 5, 2022
అందుకే నీ తండ్రిని నేనో.. నా తల్లివి నీవో.. ఎవరినెవరు లాలిస్తున్నారో అర్థం కాని పరిస్థితి అంటూ లాలూ లోలోన ఫీలవుతున్నారు. గతంలో తెలుగు సినీ నటుడు ఏవీఎస్ కు కాలేయం మార్చాల్సి వచ్చింది.. అప్పుడు కూడా ఆయన కుమార్తె తన కాలేయాన్ని దానం ఇచ్చారు…