విధాత, నల్గొండ: భూ కబ్జాలను అధికార యంత్రాంగం అడ్డుకోలేక పోతుందని దీంతో జిల్లాలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, రియల్ ఎస్టేట్ వ్యాపారుల అధీనం అవుతున్నాయని పార్లమెంట్ సభ్యులు ఉత్తంకుమార్ రెడ్డి ఆరోపించారు.
గురువారం ఆయన సూర్యాపేట జిల్లా పరిషత్ సమావేశానికి హాజరైన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో మఠంపల్లి నేరేడుచర్ల మండలంలో ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్న అధికార యంత్రాంగం అధికార పార్టీ ఒత్తిళ్లతో ప్రేక్షక పాత్ర వహిస్తుందన్నారు.
అలాగే జిల్లాలో 2021వాన కాలం ధాన్యం కొనుగోలులో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, నేరేడుచర్ల రెండు సహకార సంఘాల పరిధిలో ధాన్యం కొనుగోలు చేయకున్న చేసినట్లుగా తప్పుడు రికార్డులు సృష్టించి కోట్లు దండుకున్నారని ఈ కుంభకోణంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు లేవని ఇందులో అధికారుల హస్తం కూడా ఉందని ఆయన ఆరోపించారు. మూసీ నది చెక్ డ్యామ్‌ల ఎంపిక, టెండర్లలో అవినీతి జరిగి కోట్ల చేతులు మారాయని దీనిపై విచారణ జరపాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.