Liquor ATM | మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. అందుబాటులోకి లిక్కర్‌ ఏటీఎంలు..! ఇక తాగినోళ్లకు తాగినంత..!!

Liquor ATM | మద్యం ప్రియులకు నిజంగా ఇది తీపికబురే..! అదేంటో అనుకుంటున్నారా? మీరు ఇప్పటి వరకు డబ్బులు ఇచ్చే.. లేదంటే బంగారం ఏటీఎంలు మాత్రమే చూసి ఉంటారు..! త్వరలో మద్యం ఏటీఎంలు అందుబాటులోకి వచ్చాయి..!! ఎక్కడో కాదు మన పొరుగునే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో. స్టేట్‌ మార్కెటింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (TASMAC) చెన్నై మాల్‌లోని ఎలైట్ స్టోర్‌లో అటానమస్ లిక్కర్ వెండింగ్ మెషీన్‌ను ఏర్పాటు చేసింది. తొలిసారి పైలట్‌ ప్రాజెక్టుగా ఈ లిక్కర్‌ వెండింగ్‌ మిషన్‌ను […]

  • Publish Date - May 23, 2023 / 07:08 AM IST

Liquor ATM | మద్యం ప్రియులకు నిజంగా ఇది తీపికబురే..! అదేంటో అనుకుంటున్నారా? మీరు ఇప్పటి వరకు డబ్బులు ఇచ్చే.. లేదంటే బంగారం ఏటీఎంలు మాత్రమే చూసి ఉంటారు..! త్వరలో మద్యం ఏటీఎంలు అందుబాటులోకి వచ్చాయి..!! ఎక్కడో కాదు మన పొరుగునే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో. స్టేట్‌ మార్కెటింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (TASMAC) చెన్నై మాల్‌లోని ఎలైట్ స్టోర్‌లో అటానమస్ లిక్కర్ వెండింగ్ మెషీన్‌ను ఏర్పాటు చేసింది.

తొలిసారి పైలట్‌ ప్రాజెక్టుగా ఈ లిక్కర్‌ వెండింగ్‌ మిషన్‌ను ప్రారంభించింది. దీంతో మద్యం ప్రియులకు 24 గంటల పాటు మద్యం దొరకనున్నది. ఇప్పటికైతే కేయంబేడు సమీపంలోని వీఆర్‌మాల్‌, టెన్‌ స్క్వేర్‌ మాల్‌, రాయపేట ఎక్స్‌ప్రెస్‌ అవెన్యూ, వేళచ్చేరి ఫీనిక్స్‌మాల్‌ ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకువచ్చారు.

కేయంబేడు సహా మూడుచోట్ల లిక్కర్‌ వెండింగ్‌ మిషన్లను అందుబాటులోకి తీసుకురాగా.. విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. తమిళనాడులో ప్రభుత్వమే మద్యం షాపులను నడుపుతోంది. వైన్స్‌ దుకాణాల ఎదుట బారులు తీరకుండా ఉండేందుకు ఈ లిక్కర్‌ వెండర్స్‌ను అందుబాటులోకి తెస్తున్నది.

ప్రస్తుతం శీతల పానీయాలను ఎలా కొనుగోలు చేస్తామో అదే మాదిరిగానే ఇవి పని చేయనున్నాయి. మందు అవసరం ఉన్న వ్యక్తి లిక్కర్‌ వెండింగ్‌ మిషన్‌ డిస్‌ప్లేలో తనకు తనకు నచ్చిన మద్యాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత ఎంత మద్యం కావాలో ఎంటర్‌ చేయాలి. ఆ తర్వాత డబ్బులు నగదు, ఆన్‌లైన్‌ రూపంలో చెల్లిస్తే మద్యం బాటిల్‌ బయటకు వస్తుంది.

ప్రస్తుతం పలు చోట్ల ఏర్పాటు చేసిన ఈ లిక్కర్‌ వెండింగ్‌ మిషన్ల వద్ద మందుబాబు కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఈ వెండింగ్‌ మిషన్లు ఉదయం 12 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే పని చేస్తాయని అధికారులు పేర్కొన్నారు.

Latest News