ఈ జీవి మ‌లం ప్ర‌పంచానికి ఓ వ‌రం… శాస్త్రవేత్త‌ల అధ్య‌య‌నంలో వెల్ల‌డి

మ‌లం అని పేరు ఎత్త‌గానే ఒక ర‌కంగా ఏహ్య భావం క‌లుగుతుంది కానీ.. కొన్ని జీవుల మ‌లానికి చాలా విలువ ఉంది

  • Publish Date - December 21, 2023 / 11:37 AM IST

విధాత‌: మ‌లం అని పేరు ఎత్త‌గానే ఒక ర‌కంగా ఏహ్య భావం క‌లుగుతుంది కానీ.. కొన్ని జీవుల మ‌లానికి చాలా విలువ ఉంది. ఆసియ‌న్ పాం సివెట్ అనే జాతి పిల్లులు విస‌ర్జించిన కాఫీ గింజ‌ల నుంచి త‌యారుచేసే కాఫీ ఎంతో అరుదైన‌ది, రుచిక‌ర‌మైన‌దన్న విష‌యం తెలిసిందే. అయితే వివిధ కార‌ణాల వ‌ల్ల ప్ర‌పంచ‌వ్యాప్తంగా నిస్సారం అయిపోతున్నాయి.


దీంతో పెరుగుతున్న జనాభాకు కావాల్సిన ఆహారం పండించ‌లేకపోతున్నాం. ఈ స‌మ‌స్య‌కు విరుగుడుగా భూమిని ర‌క్షించ‌డానికి ఒక జీవి మ‌లం అక్క‌ర‌కు వ‌స్తుంద‌ని శాస్త్రవేత్త‌లు చెబుతున్నారు. అదే ఒంటెలా ఉండే లామా. ఎక్కువ‌గా ద‌క్షిణ అమెరికా ఖండంలో క‌నిపించే వీటి మ‌లం (Llama Poop) లో అద్భుత‌మైన మూల‌కాలు ఉన్నాయ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. వారు అధ్య‌య‌నం (Study) చేసిన వివ‌రాలు సైన్స్ రిపోర్ట్స్‌లో ప్ర‌చురిత‌మ‌య్యాయి.


ఈ ప‌రిశోధ‌న‌లో భాగంగా శాస్త్రవేత్త‌లు పెరూ (Peru) లోని కార్డిల్లెరా బ్లాంకా అనే ప‌ర్వ‌త‌శ్రేణి వ‌ద్ద వ్య‌వ‌సాయానికి ప‌నికి రాని భూమిని ఎంచుకున్నారు. అందులో లామాల‌ను పెద్ద సంఖ్య‌లో పెంచుతూ..వాటి మ‌లాన్ని అక్క‌డ విస‌ర్జించేలా చేశారు. ఇలా మూడేళ్లు గ‌డిచాక ఆ నేల‌ను ప‌రిశీలించ‌గా సార‌వంతంగా మారి వ్య‌వ‌సాయానికి అనుకూలంగా త‌యారైన‌ట్లు ప‌రిశోధ‌కులు గుర్తించారు.


లామా విస‌ర్జితం.. భూమి త‌న మూల‌కాల‌ను తిరిగి పొంద‌డంలో సాయ‌ప‌డుతుంద‌ని తెలుసుకున్నారు. మొత్తంగా ప‌రిశోధ‌న చేసిన ప్రాంతంలో గ‌తంలో కంటే 57 శాతం ఎక్కువ‌గా పచ్చ‌ద‌నం పెరిగింద‌ని ఈ ప‌రిశోధ‌న ప‌త్రం పేర్కొంది. దీనికంత‌టికీ కార‌ణం లామాల ఉనికేన‌ని అభిప్రాయ‌ప‌డింది. లామా బీన్‌గా పిలిచే లామా పేడ‌లో కార్బ‌న్‌, నైట్రోజ‌న్ వంటి ఎన్నో మూలకాలు ఉంటాయి. ఇవి భూమి సార‌వంతంగా మార‌డానికి అత్య‌వ‌స‌రమ‌న్న విష‌యం తెలిసిందే.


లామాలపై ఇటువంటి ప‌రిశోధ‌న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇదే మొద‌టిద‌ని.. ఇందులో తాము సానుకూల ఫ‌లితాల‌ను సాధించిన‌ట్లు జియోగ్రాఫ‌ర్ అనాయ‌స్ జిమ‌ర్ వెల్ల‌డించారు. ఆండిస్ ప‌ర్వ‌త సానువుల్లో ఉండే గిరిజ‌నులు త‌మ పొలాల్లో లామాలు తిర‌గ‌డం ఒక అదృష్టంగా భావిస్తార‌ని దానికి కార‌ణం వాటి మ‌లంలో ఉండే పోష‌కాలే కార‌ణ‌మైం ఉంటుంద‌న ఆమె అన్నారు.


ప్ర‌స్తుతం పెరూ దేశంలో భారీ మంచు ప‌ర్వ‌తాలు క‌రిగిపోతున్నాయి. ఇప్ప‌టికే అక్క‌డి 50 శాతం గ్లేషియ‌ర్‌లు క‌రిగిపోవ‌డం మొద‌లైనందని శాస్త్రవేత్త‌ల అంచనా. వీటి నుంచి వ‌చ్చే నీరు.. నేల మీద వేగంగా పారుతూ అక్క‌డి మూల‌కాల‌ను తీసుకుపోతుంది. త‌ద్వారా వ్య‌వ‌సాయానికి తీవ్ర న‌ష్టం క‌లుగుతుంది. కాబ‌ట్టి త‌క్ష‌ణావ‌స‌రంగా లామాల‌ను పెంచుకోవ‌డానికి పెరూ వ్య‌వసాయ శాస్త్రవేత్త‌లు మొగ్గు చూపుతున్నారు.

Latest News