Site icon vidhaatha

లవర్ బాయ్ సిద్ధార్థ అడ్డంగా దొరికేశాడు..!

విధాత: దక్షిణాదిలో రొమాంటిక్ లవర్ బాయ్ అంటే సిద్ధార్థ పేరు చెప్పాలి. తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మ‌రిల్లు, కొంచెం ఇష్టం.. కొంచెం క‌ష్టం, ఆట వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకున్నారు. త‌మిళంలోనూ మంచి క్రేజ్ ఉంది. దాదాపు 45 ఏళ్ల వ‌య‌సు ఉన్న సిద్దార్ధ్ ఇప్పటికీ నిత్యం ఎఫైర్స్ తో వార్తల్లో నిలుస్తూ ఉంటారు.

సిద్ధార్థ కు త్రిష, సమంత వంటి పలువురితో ఎఫైర్స్ ఉన్నట్టు వార్తలు వచ్చాయి. సమంతతో కలిసి రాహుకేతు పూజల కోసం ఓ సారి శ్రీకాళహస్తి దేవాలయం కూడా వచ్చారు. అయితే 2003లో మేఘన అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సిద్ధార్థ 2007లో విడాకులు తీసుకోగా వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇక విషయానికి వస్తే కొంతకాలంగా లవర్ బాయ్ సిద్ధార్థ్ అందాల తార ఆదితీ రావు హైదరి మధ్య ఎఫైర్ న‌డుస్తోంద‌ని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్త కోలీవుడ్, టాలీవుడ్ నిత్యం ఎక్కడో ఓ చోట వార్తల్లో నిలుస్తూనే ఉంది. కానీ దీనిని ఇద్దరు అధికారికంగా ఏనాడు ధ్రువీకరించలేదు. అలాగని ఏనాడు ఖండించ‌నూ లేదు. దీంతో అభిమానుల్లో డైలమా అలానే ఉంది.

అయితే ఈ జంట పెళ్లికి సిద్ధమవుతుందంటూ కొన్ని మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. కానీ వీరు ఇప్పటివరకు బహిరంగంగా కనిపించకపోవడంతో ఆధారాలు లేకపోవడం వల్ల మీడియా వార్తలు ఊహ జనిత కథనాలుగా మిగిలిపోయాయి.

అయితే ఇప్పుడు అధికారికంగా హింటు వచ్చింది. హైదరాబాదులో శ‌ర్వానంద్ నిశ్చితార్థ వేడుకల్లో సిద్ధార్థ తన గర్ల్ ఫ్రెండ్ ఆదితీరావు హైద‌రితో జంటగా ఈ వేడుకకు హజరై వదూవరులను ఆశీర్వదించారు.. అకకడి వచ్చిన వారి కళ్లన్నీ శ‌ర్వానంద్‌, రక్షిత రెడ్డిల మీద ఉంటే మీడియా కన్ను మాత్రం సిద్ధార్థ, ఆదితీ రావు హైద‌రిపై ఉంది.

సిద్ధార్థ శర్వానంద్, ఆదితీరావు హైద‌రీలు మహాసముద్రంలో కలిసి నటించారు. అప్పటి నుంచి వీరి మధ్య బంధం కొనసాగుతూ వస్తుంది. గతంలో ఓ సారి సిద్ధార్థ ఆదితీతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసి హృదయంలో యువరాణి అని ప్రేమగా వ్యాఖ్యను జోడించారు.

కొన్నేళ్లుగా సహజీవనంలో ఉన్నారని కథనాలు వస్తున్నాయి. తాజాగా శ‌ర్వానంద్ నిశ్చితార్ధానికి ఇలా కలిసి రావడంతో ఈ జంట తమ సంబంధాన్ని అధికారికంగా చేసినట్టేనని టాక్ వినిపిస్తోంది. జంట బాగుంది.. అందంగా ఉంది.. ఇక పెళ్లికి భాజాలే పెండింగ్ అంటూ అభిమానులు చెవులు కోరుకొంటున్నారు..!

Exit mobile version