విధాత: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీ హనుమంతరావు మరోసారి అలకబూనారు. గాంధీ భవన్‌కు వచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రేను రాజీవ్ గాంధీ క్రికెట్ టోర్నీకి రావాలని వీహెచ్ ఆహ్వానించారు.
ముందస్తు కార్యక్రమాల దృష్ట్యా రాలేకపోతున్నానని ఠాక్రే వీహెచ్‌కు తెలిపారు. అయితే ఠాక్రే, వీహెచ్ మాట్లాడుతుండగా మహేశ్ కుమార్ జోక్యం చేసుకున్నారు. వీహెచ్, మహేశ్ కుమార్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మహేశ్ కుమార్ జోక్యంపై వీహెచ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం గాంధీ భవన్ నుంచి వీ హనుమంతరావు అలిగి వెళ్లిపోయారు.
హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమంపై రాష్ట్ర నేతలతో చర్చించేందుకు మాణిక్ రావు ఠాక్రే ఇవాళ గాంధీ భవన్‌కు వచ్చారు. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో ఠాక్రే భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో గాంధీ భవన్‌లో 3 రోజుల పాటు ఠాక్రే వరుస భేటీలు నిర్వహించనున్నారు.