Site icon vidhaatha

బైక్‌పై భ‌ర్త‌కు గుండెపోటు.. భార్య సీపీఆర్ చేసినా ద‌క్క‌ని ప్రాణం

Heart Attack | ఇది హృద‌య విదార‌క ఘ‌ట‌న‌. భార్య‌ను ఎక్కించుకుని బైక్‌పై వెళ్తున్నాడు ఓ భ‌ర్త‌. పెట్రోల్ పోయించుకుందామ‌ని చెప్పి ఓ బంక్ వ‌ద్ద బైక్‌ను ఆపి, భార్య‌ను కింద‌కు దించాడు. ఇక బంక్‌లోకి బైక్‌ను తీసుకెళ్తుండ‌గా, భ‌ర్త గుండెపోటుకు గుర‌య్యాడు. గుండెపోటుతో కుప్ప‌కూలిన భ‌ర్త‌ను ప్రాణాల‌తో కాపాడుకునేందుకు సీసీఆర్ చేసినా ఫ‌లితం లేకుండా పోయింది. ఈ విషాద ఘ‌ట‌న నిజామాబాద్ జిల్లా సిరికొండ మండ‌లం కొండూరు గిర్ని చౌర‌స్తా వ‌ద్ద చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ధ‌ర్ప‌ల్లి మండ‌లం రేకుల‌ప‌ల్లి గ్రామానికి చెందిన సాగ‌ర్(40) ట్యాక్సీ డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. సాగ‌ర్ భార్య వాస‌వి గ్రామంలో ఆశా వ‌ర్క‌ర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తోంది. అయితే సోమ‌వారం సిరికొండ పీహెచ్‌సీలో మీటింగ్ ఉండ‌టంతో అక్క‌డికి బైక్‌పై త‌న భార్య‌ను తీసుకెళ్లాడు సాగ‌ర్. మ‌ళ్లీ సాయంత్రం ఇంటికి తిరిగి వ‌స్తుండ‌గా, పెట్రోల్ కోస‌మ‌ని గిర్ని చౌర‌స్తా వ‌ద్ద త‌న బైక్‌ను ఆపి, భార్య‌ను దించేశాడు.

భూ వివాదాల‌తో బావ‌ను చంపి.. త‌ల‌తో సెల్ఫీతో దిగారు..

సాగ‌ర్ బంక్‌లోకి వెళ్తుండ‌గా, గుండెపోటుతో కుప్ప‌కూలాడు. భ‌ర్త‌ను గ‌మ‌నించిన భార్య అత‌నికి సీపీఆర్(కార్డియో ప‌ల్మ‌న‌రీ రిసిటేష‌న్) చేసింది. అయిన‌ప్ప‌టికీ భ‌ర్త ప్రాణాలు ద‌క్క‌లేదు. భ‌ర్త‌ను ప్రాణాలతో కాపాడుకునేందుకు ఆమె చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేదు. దీంతో ఆమె ప‌డిన వేద‌న చూప‌రుల‌ను కంట‌త‌డి పెట్టించింది. సాగ‌ర్ మృతితో రేకుల‌ప‌ల్లిలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

నడిరోడ్డుపై యువ‌కుడిని బండ రాళ్ల‌తో.. కిరాతకంగా చంపిన మ‌హిళ‌లు.. వీడియో

Exit mobile version