Drunk Bridegroom | మరి కొద్ది గంటల్లో పెళ్లి( Marriage ).. ఇక పెళ్లి మండపానికి వధూవరుల కుటుంబ సభ్యులు చేరుకుంటున్నారు. ముహుర్తానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కొనసాగుతున్నాయి. పెళ్లి పీటలపైకి వధువు( Bride ) కూడా రానే వచ్చేసింది. కానీ వరుడు( Bridegroom ) మాత్రం రాలేదు. ముహుర్త సమయం ముంచుకొస్తున్నప్పటికీ వరుడు పత్తా లేడు. ముహుర్త సమయం అయిపోయాక తాగిన మత్తులో వధువు ఇంటికి చేరుకున్న వరుడిని చూసి ఈ పెళ్లి నాకొద్దంటూ ఆమె తెగేసి చెప్పింది.
వివరాల్లోకి వెళ్తే.. బీహార్( Bihar )లోని భగల్‌పూర్ జిల్లాలోని సుల్తాన్‌గంజ్‌కు చెందిన ఓ యువకుడికి పెళ్లి నిశ్చయమైంది. ఇక వివాహాన్ని వధువు ఇంటి దగ్గరే చేయాలని నిర్ణయించారు. దీంతో పెళ్లికి ఏర్పాట్లు చేశారు. వధువు కూడా సిద్ధమైంది. ముహుర్త సమయం మించిపోతున్నప్పటికి వరుడు రాలేదు. అయితే వరుడు తన స్నేహితులతో కలిసి మద్యం పార్టీలో బిజీ అయిపోయాడు. వరుడు కూడా పీకల దాకా మద్యం( alcohol ) సేవించి, తన పెళ్లి విషయాన్ని కూడా మరిచిపోయాడు.
మద్యం మత్తు నుంచి తేరుకున్న తర్వాత.. పెళ్లి మండపానికి చేరుకున్నాడు. వరుడిని చూసి వధువు షాక్ అయింది. ఇప్పుడే బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న అతను భవిష్యత్‌పై తనకు నమ్మకం లేదని వధువు చెప్పింది. తనకు ఈ పెళ్లి వద్దని, కట్నం కింద ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.