Site icon vidhaatha

Kerala | కదులుతున్న రైలులో తోటి ప్రయాణికులపై పెట్రోల్‌ దాడి.. తప్పించుకునేందుకు ప్రయత్నించి ముగ్గురు మృతి..!

Kerala | కేరళలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. కదులుతున్న రైలులో ఓ వ్యక్తి తోటి ప్రయాణికులపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడో ఓ ప్రబుద్ధుడు. ఆదివారం రాత్రి జరిగిన కోజికోడ్‌ జిల్లా ఎలత్తూరు సమీపంలో జరిగిన దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఎనిమిది మంది ఆసుపత్రి గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది.

వివరాల్లోకి వెళితే.. అలప్పుజా-కన్నూరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్‌లోని డీ1 కంపార్ట్‌మెంట్‌లో రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దాడి తర్వాత నిందితుడు ఎమర్జెన్సీ చైన్‌ లాగి.. రైలు కొద్ది వేగం తగ్గిన తర్వాత పారిపోయాడు. రైలు కోజికోడ్ పట్టణం దాటిన తర్వాత కోరాపుజ రైల్వే వంతెన వద్దకు చేరుకోగానే, ప్రయాణికులు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)కి సమాచారం అందించగా మంటలను ఆర్పివేశారని ఆయన చెప్పారు.

అయితే, ఇద్దరు వ్యక్తులకు వాగ్వాదం జరిగిందని, ఆ తర్వాత ఈ దాడి జరిగినట్లు సమాచారం. కోజికోడ్ సిటీ పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ఓ మహిళపై పెట్రోల్‌ పోసి నిప్పించేందుకు ప్రయత్నించాడు.

అతను తెల్ల చొక్కా వేసుకొని ఉన్నాడని సాక్షి పేర్కొన్నారు. అతను రెండు పెట్రోల్‌ బాటిళ్లు తీసుకువచ్చాడని తెలిపారు. మరో బాటిల్‌లో ఉన్న పెట్రోల్‌ను మరికొందరిపై చల్లాడని చెప్పాడు. మహిళను రక్షించే క్రమంలో మరికొందరికి గాయాలయ్యాయని వివరించాడు.

అయితే, కొందరు పెట్రోల్‌ పోసే క్రమంలో కొందరు తప్పించుకునేందుకు రైలు నుంచి దూకేశారు. ఘటన తర్వాత చిన్నారి సహా ముగ్గురు కనిపించకుండా పోయారని, ఆ తర్వాత రైల్వే ట్రాక్‌ వెంట పరిశీలించగా మూడు మృతదేహాలు లభయ్యాయని పేర్కొన్నారు.

మంటల నుంచి తప్పించుకునేందుకు తప్పించుకునేందుకు ప్రయత్నించి ఉండడంతో కింద పడి చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకొని అనుమానితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

Exit mobile version