Manchu Laxmi | సినిమాల్లో బెస్ట్ యాక్టర్‌గా ప్రూవ్ చేసుకోవాలంటే ఎలాంటి పాత్ర అయినా పోషించాలి. అప్పుడే ఇండస్ట్రీలో తమకంటూ గుర్తింపు వస్తుంది. చాలా మంది నటీనటులు కొన్ని పాత్రల్లో నటించేందుకు ఇష్టపడరు. కొందరు మాత్రం చాలెంజింగ్ తీసుకుంటారు.
ఇందులో ఒకరు మంచు లక్ష్మీ ప్రసన్న. మోహన్‌బాబు తనయగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. సినిమాల్లో నటించడంతో పాటు దర్శకత్వం వహించడంతో పాటు సినిమాలను ప్రొడ్యూస్ చేసింది. తాజాగా మలయాళీ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటించిన ‘మాన్‌స్టర్’. ఈ సినిమా డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదలవగా.. మంచి టాక్‌ను సొంతం చేసుకున్నది.
— vidhaathanews (@vidhaathanews) December 8, 2022
ఈ సినిమాలో మంచు లక్ష్మి లెస్బియన్ క్యారెక్టర్‌లో నటించి, మెప్పించింది. ఇప్పటి వరకు హీరోయిన్, విలన్ తరహా పాత్రలు పోషించిన మంచు లక్ష్మి.. మాన్‌స్టర్ చిత్రంలో కొత్తగా కనిపించింది. సినిమాలో స్క్రీన్ స్పేస్ తక్కువే అయినప్పటికీ.. తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.
సినిమాలో తోటి నటి హనీ రోజ్‌తో లక్ష్మి లిప్‌లాక్ సీన్లు ఇప్పటికే వైరల్‌గా మారాయి. ఇలాంటి రోల్స్‌ను చాలెంజింగ్‌గా తీసుకున్నప్పుడే నటిగా సక్సెస్ అయినట్లు అని ప్రేక్షకులు అంటున్నారు. ఇదిలా ఉండగా.. ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రోల్స్ బారినపడే మంచు లక్ష్మి.. ఈ సినిమాలో పోషించిన పాత్రతో నటిగా ఓ మెట్టు ఎక్కేసిందని మంచు ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు.
— vidhaathanews (@vidhaathanews) December 8, 2022