Manchu Lakshmi | పిల్ల‌ల్ని కనొద్దు, ఇబ్బండి ప‌డొద్దు.. మంచు ల‌క్ష్మీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Manchu Lakshmi | టాలీవుడ్ హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మంచు లక్ష్మీ మాటలు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల ఆమె న ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, బాధ్యతలు, డబ్బు పై అవగాహన, తల్లిదండ్రుల పాత్ర వంటి అనేక అంశాలపై తనదైన స్టైల్‌లో బోల్డ్‌గా చెప్పిన విషయాలు తెగ వైరల్ అయ్యాయి.

Manchu Lakshmi | టాలీవుడ్ హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మంచు లక్ష్మీ మాటలు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల ఆమె న ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, బాధ్యతలు, డబ్బు పై అవగాహన, తల్లిదండ్రుల పాత్ర వంటి అనేక అంశాలపై తనదైన స్టైల్‌లో బోల్డ్‌గా చెప్పిన విషయాలు తెగ వైరల్ అయ్యాయి. తాజాగా పిల్ల‌ల గురించి సంచ‌ల‌న కామెంట్స్ చేసింది.మీకు పిల్ల‌ల‌ని క‌నాల‌ని ఉంటే క‌నండి, అంతే త‌ప్ప ఎవ‌రో ఫోర్స్ చేశార‌ని క‌నొద్దు అని పేర్కొంది. పిల్ల‌ల‌ని క‌నే విష‌యంలో ఇత‌రుల మాట‌లు అస్స‌లు వినొద్దు. ఓపిక‌, ఆర్ధికంగా బ‌లంగా లేకపోతే క‌న‌క‌పోవ‌డ‌మే మంచిది.

ఆర్ధికంగా బ‌లంగా లేన‌ప్పుడు పిల్ల‌ల‌ని క‌నొద్దు.భార్య‌, భ‌ర్త‌లు ఇద్ద‌రు క‌ష్ట‌పడితేనే పిల్ల‌లు సంతోషంగా ఉంటారు.ఈ కాలం పిల్ల‌లు ఐ పాడ్స్‌తో పెరుగుతున్నారు. వారిని చూస్తే భ‌య‌మేస్తుంద‌ని మంచు ల‌క్ష్మీ పేర్కొంది. ప్ర‌స్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.ఇక ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో వంట చేయగలవా? అని అడగగా లక్ష్మీ నవ్వుతూ స్పందించింది. నేను ఎంత బాగా వండుతానో మా కూతుర్ని అడిగి తెలుసుకోండి. అమెరికాలో 7 సంవత్సరాలు ఒంటరిగా ఉన్నప్పుడు అన్ని వంటలూ నేనే చేసుకున్నా” అని చెప్పింది. ఇటాలియన్, ఇండియన్, చైనీస్ వంటకాలు అద్భుతంగా చేస్తానని చెప్పిన ఆమె,ఇండియాలో వంట చేయాలనే ఫీలింగ్ రాదు… కానీ విదేశాల్లో ఉంటే వంట చేయడం నాకు చాలా ఇష్టం” అంటూ చమత్కరించింది.

ఇక డబ్బు ఎలా పనిచేస్తుంది, ఎక్కడ ఖర్చు పెట్టాలి ఇవన్నీ ఇప్పుడే నేర్చుకుంటున్నా” అని చెప్పింది. పిల్లలకు స్కూల్ రోజుల నుంచే ఫైనాన్షియల్ లిటరసీ నేర్పించాల్సిన అవసరాన్ని కూడా హైలైట్ చేసింది. స్కూల్లో సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్, ట్యాక్స్ లాంటి బేసిక్ ఫైనాన్స్ చదవాలి. కాలేజీ లెవెల్లో అడ్వాన్స్‌డ్ మనీ మేనేజ్‌మెంట్ నేర్పాలి” అని ఆమె అభిప్రాయపడింది. మహిళలకు ప్రభుత్వ పథకాలు, ఆర్థిక అవకాశాలపై అవగాహన చాలా తక్కువగా ఉందని, ఇది తప్పనిసరిగా మారాలని సూచించింది.

Latest News