విధాత: ఛత్తీస్‌గఢ్ కాంకేర్‌లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. సర్పంచ్, మాజీ సర్పంచ్‌పై దాడి చేశారు. రాళ్లతో కొట్టి, నాటు తుపాకీతో కాల్పులు జరిపారు.
మావోయిస్టుల దాడిలో మాజీ సర్పంచ్ నోహర్ ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రంగా గాయపడిన సర్పంచ్ పరిస్థితి విషమంగా ఉన్నది. ఆయనను ఆస్పత్రికి తరలించారు.
పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా పనిచేస్తున్నాడని దాడి చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.