విధాత: మునుగోడులో భారీగా బోగస్ ఓట్లు నమోదయ్యాయని ఆరోపిస్తూ బీజేపీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. 2 నెలల్లోనే 25వేల కొత్త ఓట్లు నమోదయ్యాయని పిటిషన్‌లో పేర్కొన్నది.
జులై 31 వరకు ఉన్న ఓటరు జాబితానే పరిగణనలోకి తీసుకునేలా అధికారులను ఆదేశించాలని బీజేపీ పిటిషన్‌లో కోరింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఎల్లుండి విచారణ జరపనున్నది.
ఈ నెల 14న మునుగోడు ఓటరు జాబితాను ఈసీ ప్రకటించనున్నది. హైకోర్టు ఆదేశించేవరకు లిస్ట్ ప్రకటించకుంగా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
ఫార్మ్-6 కింద వచ్చిన దరఖాస్తుల్లో తప్పుడు ఓటర్లు ఉన్నారని నేడు అత్యవసరంగా విచారణ జరపాలని న్యాయవాది రచనారెడ్డి కోర్టును కోరారు. లంచ్‌మోషన్ విచారణకు హైకోర్టు నిరాకరించింది.