Site icon vidhaatha

ఫ్లాష్. ఫ్లాష్: మెదక్.. కౌడిపల్లి తహశీల్దార్ కార్యాలయంలో ACB సోదాలు.. తలుపులు పెట్టి 40 నిమిషాలుగా తనిఖీలు

విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా కౌడిపల్లి (kowdipally)మండల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ (Anti corruption bureau) సోదాలు జరుగుతున్నాయి. దాదాపు 40 నిమిషాల నుంచి ఏసీబీ (ACB) అధికారులు కార్యాలయం తలుపులు మూసివేసి, గడియ పెట్టి మరీ తనిఖీలు నిర్వహిస్తుండటం జిల్లాలో సంచలనం రేపుతున్నది.

అవినీతి ఫిర్యాదుపై తనిఖీలు చేస్తున్నట్టు సమాచారం. అయితే ఎవరైనా అధికారిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌(Redhanded)గా పట్టుకున్నారా? లేక ఫిర్యాదుపై వివరాలు సేకరించేందుకు వచ్చారా అన్న విషయం ఇంకా తెలియరాలేదు.

తాసీల్దార్‌ కార్యాలయానికి ఏసీబీ అధికారులు వచ్చారన్న సమాచారం అందటంతో ప్రజలు, మీడియా అక్కడ గుమిగూడటంతో అంతా హడావుడి కనిపిస్తున్నది. పూర్తి వివరాలు అందాల్సి ఉన్నది.

Exit mobile version