ఇన్సూరెన్స్ డబ్బుల కోసం హత్య.. మృతుడి గుర్తింపు!

విధాత, మెదక్ ఉమ్మడి జిల్లా బ్యూరో: ఇటీవల రాష్ట్రంలో సంచలనం సృష్టించిన 7.4 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపురం గ్రామ శివారులో ఈనెల 9న కారు దగ్దం, గుర్తు తెలియని వ్యక్తి హత్య, సజీవదహనం కేసులో మృతుడిని పొలీసులు ఎట్టకేలకు గుర్తించారు. సెక్రటేరియట్‌ ఉద్యోగి, భీంలా తండాకు చెందిన ధర్మానాయక్ పన్నిన ఈ పథకంలో హత్య గావించబడింది ఓ అభాగ్యుడు, రోజు కూలీ బాబుగా పొలీసులు గుర్తించారు. జిల్లా ఎస్పీ రోహిణి […]

  • Publish Date - January 21, 2023 / 07:36 AM IST

విధాత, మెదక్ ఉమ్మడి జిల్లా బ్యూరో: ఇటీవల రాష్ట్రంలో సంచలనం సృష్టించిన 7.4 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపురం గ్రామ శివారులో ఈనెల 9న కారు దగ్దం, గుర్తు తెలియని వ్యక్తి హత్య, సజీవదహనం కేసులో మృతుడిని పొలీసులు ఎట్టకేలకు గుర్తించారు.

సెక్రటేరియట్‌ ఉద్యోగి, భీంలా తండాకు చెందిన ధర్మానాయక్ పన్నిన ఈ పథకంలో హత్య గావించబడింది ఓ అభాగ్యుడు, రోజు కూలీ బాబుగా పొలీసులు గుర్తించారు. జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ప్రత్యేక టీములు ఎర్పాటు చేసి దర్యాప్తు చేసి ఎట్టకేలకు మృతుడిని గుర్తించారు.

వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బోకొరో తహశీల్ పరిధి లాగ్లూడ్ గ్రామానికి చెందిన గల్గాయ్ బాబు(42) రోజు కులీ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వారిది. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కూతుళ్లు, వృద్ద తల్లి ఉండగా వారంతా బాబు పైనే ఆధారపడి జీవిస్తున్నారు.

మృతుడు బాబు రోజు కులీ కోసం రైలులో నాందేడ్ నుంచి నిజామాబాద్‌కు ప్రతి రోజూ రైలులో వచ్చి కూలీ పనులు ముగించుకుని తిరిగి స్వస్థలానికి చేరుకుంటాడు. ఆ క్రమంలోనే ఓ రోజు కూలీ కోసం వచ్చిన బాబు ధర్మానాయక్ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం పన్నిన కుట్రలో బలి అయ్యాడు. బాబు అంత్యక్రియలు సైతం ధర్మా కుటుంబ సభ్యులు నిర్వహించిన విషయం తెలిసిందే.

తప్పించుకున్న అంజయ్య..

బాబు హత్యకు ఒక రోజు ముందు ధర్మానాయక్ మామిడి తోటలో పని ఉందని వికారాబాద్ జిల్లా పరిగి మండలం లక్ష్మీదేవి పల్లి గ్రామానికి చెందిన కట్లా అంజయ్యన పిలిపించి హైదరాబాద్ నాంపల్లి మెట్రో రైల్వే స్టేషన్ నుంచి కారులో నిజామాబాద్ వరకు తీసుకెళ్లి పీకల దాకా మద్యం తాగించారు.

అనంతరం భోజనం చేసి రావాలని ధర్మా చెప్పడంతో అంజయ్యకు అనుమానం వచ్చి భోజనం చేసి అక్కడి నుంచి అటే హైదరాబాద్‌కు పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు.