– మహిళలు-1,12,218, పురుషులు-1,0 28,20, ట్రాన్స్ జెండర్ – 5
– జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా వెల్లడి
విధాత,మెదక్ ప్రత్యేక ప్రతినిధి: సాధారణ ఎన్నికలు 2023 లో భాగంగా కలెక్టర్ కార్యాలయం లో వీడియో సమావేశ మందిరంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజర్షి షా,జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తో కలసి మాట్లాడారు.ఈ సంద్భంగా
మెదక్ శాసనసభ నియోజకవర్గంలో మొత్తం 215043 మంది ఓటర్లు ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. అందులో మహిళలు 1,12,218 మంది, పురుషులు 1,028,20 మంది, ట్రాన్స్ జెండర్స్ ఐదుగురు ఉన్నట్లు వెల్లడించారు. గురువారం కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మెదక్ నియోజకవర్గంలో 80 ఏళ్లు నిండిన ఓటర్లు 2446 ఉండగా, యువ ఓటర్లు 8098 మంది ఉన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో మొత్తం 2,21,972 మంది ఓటర్లు ఉండగా, అందులో మహిళలు 1,13,551 మంది, పురుషులు 1,084,14 మంది, ట్రాన్స్ జెండర్లు ఏడుగురు ఉన్నారుని తెలిపారు. 80 ఏళ్లు దాటిన వారు 1716 మంది, యువ ఓటర్లు 8104 మంది నమోదైనట్లు వివరించారు.
1.41 కోట్ల నగదు సీజ్ : ఎస్పీ
జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు మొత్తం రూ.1,41,09,480 నగదు సీజ్ చేశామని తెలిపారు. ఎంసీసీలో 30 ఫిర్యాదులు, సీ-విజిల్ ద్వారా 22 ఫిర్యాదులు వచ్చాయని, అందులో 9 ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. 27,690 లీటర్ల మద్యం సీజ్ చేశామని, ఎఫ్ ఎస్ టీ టీమ్ ద్వారా 12,01,920 నగదు సీజ్ చేశామని, పోలీస్ డిపార్ట్ మెంట్ ద్వారా 1,31,63,647 ద్వారా డబ్బు సీజ్ చేశామని వివరించారు. నామినేషన్ల నోటిఫికేషన్ 3 నుంచి మొదలవుతుందని, 10న ముగుస్తుందన్నారు. నామినేషన్లు ఉదయం 11 నుంచి 3 గంటల వరకు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్వోలు నర్సాపూర్ శ్రీనివాస్, మెదక్ అంబదాస్ రాజేశ్వర్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు