ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు మెట్రో పొడిగింపు: మంత్రి కేటీఆర్‌

ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు మెట్రో పొడిగింపు విధాత‌: నగరంలో ట్రాఫిక్‌ రద్దీ రోజు రోజుకూ పెరిగిపోతున్నది. దీని దృష్ట్యా ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు మెట్రో రైల్‌ను పొడిగించాలని స్థానికులు కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ దీనిపై స్పందించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది కేసీఆర్‌ ప్రభుత్వమే. అప్పుడు ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు మెట్రోను పొడిగిస్తామన్నారు. ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి ప్రారంభోత్సవం చేశారు. […]

  • Publish Date - December 6, 2022 / 09:12 AM IST
  • ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు మెట్రో పొడిగింపు

విధాత‌: నగరంలో ట్రాఫిక్‌ రద్దీ రోజు రోజుకూ పెరిగిపోతున్నది. దీని దృష్ట్యా ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు మెట్రో రైల్‌ను పొడిగించాలని స్థానికులు కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ దీనిపై స్పందించారు.

వచ్చే ఎన్నికల్లో గెలిచేది కేసీఆర్‌ ప్రభుత్వమే. అప్పుడు ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు మెట్రోను పొడిగిస్తామన్నారు. ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి ప్రారంభోత్సవం చేశారు. తర్వాత ఆయన మాట్లాడారు. రెండో విడతలో నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు మెట్రో నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.