విధాత: హైదరాబాద్ పంజాగుట్టలో అర్ధరాత్రి దుండగుడు మహిళ గొంతు కోశాడు. బాధితురాలు నిషా (35) పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పీఏ దాడి చేశాడని బాధితురాలు ఆరోపించింది. పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
దాడికి పాల్పడిన విజయ్ తన పీఏ కాదని,గతంలో ఆయన ఓ కార్పొరేటర్ వద్ద పనిచేశాడని ఎమ్మెల్యే గోపినాథ్ తెలిపారు.