విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో అర్హులైన పేదవారికి కాకుండా బిఆర్ఎస్ పార్టీకి చెందిన వారినే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులుగా ఎంపిక చేశారని ఆరోపిస్తు ఎమ్మెల్యే సునీతను బాధిత గ్రామస్తులు అడ్డుకున్నారు.
ఎమ్మెల్యే ను డబుల్ బెడ్ రూమ్ ల్లోకి రాకుండా అడ్డుగా నిలబడి నిరసన తెలిపారు. కార్యక్రమానికి వేసిన టెంట్లను కూల్చి, కుర్చీలను విరగ్గొట్టారు. కొలనుపాక లోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద గల ఆలేరు చేర్యాల రహదారిపై కిరోసిన్ డబ్బాలతో బైఠాయించి నిరసనకు దిగారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు, గ్రామస్తులకు మధ్యన వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.