Site icon vidhaatha

ఉడుత‌కు పులి అని పేరు పెడితే పులి అయితదా: BRSపై ఎమ్మెల్సీ అశోక్‌బాబు

విధాత: జాతీయ పార్టీ పెట్టినా కేసీఆర్‌లో జాతీయ‌త లేద‌ని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు విమ‌ర్శించారు. కేసీఆర్‌ను ఏ రాష్ట్రం స్వాగ‌తించినా ఏపీ గౌర‌వించ‌ద‌న్నారు. రాష్ట్రాన్ని విడ‌దీసి ద్వితీయ శ్రేణి అన్నందుకు ఏపీ ప్ర‌జ‌లు గౌర‌వించ‌రని అన్నారు.

జాతీయ పార్టీగా పేరు మార్చినంత మాత్రాన జాతీయ పార్టీ కాలేద‌న్నారు. ఉడుత‌కు పులి అని పేరు పెడితే పులి అయిపోద‌ని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు నిజాయితీ లేద‌ని కాంగ్రెస్ విలీనం ఉదంత‌మే చెబుతుందన్నారు. ఎస్సీని సీఎం చేస్తాన‌ని కేసీఆర్ సీఎం అయ్యారని టీడీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యానించారు.

Exit mobile version