Site icon vidhaatha

రేవంత్ రెడ్డిపై డీజీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీలు

విధాత: ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతి భవన్ ను పేల్చేయాలంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన పాదయాత్రలో చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, రవీందర్రావు, ఎల్ రమణ, తాత మధులు డీజీపీ అంజని కుమార్ ని కలిసి ఫిర్యాదు చేశారు. చట్టసభలో సభ్యుడై ఉండి కూడా ప్రభుత్వ భవనాలను పేల్చేయాలంటూ చట్ట వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

Exit mobile version