Holidays in January | కొత్త సంవత్సరం( New Year ) వేడుకలు అందరూ ఎంజాయ్ చేశారు. ఇక ఈ ఏడాది ఎలా గడపాలి..? పర్యాటక ప్రాంతాలకు( Tourism Places ) వెళ్లే ఛాన్స్ ఏమైనా ఉందా..? మరి సెలవుల( Holidays ) ప్లాన్ ఏంటి..? అనే దానిపై టూరిస్టు లవర్స్( Tourist Lovers ), కొత్త జంటలు సమాలోచనలు జరుపుతున్నాయి. అలాంటి వారికి ఏడాది ఆరంభంలోని జనవరి( January ) నెల కలిసిరానుంది. ఈ జనవరి నెలలోనే వరుసగా 9 రోజులు సెలవులు రానున్నాయి. కాస్త పక్కా ప్లానింగ్ ఉంటే ఈ లాంగ్ వీకెండ్ ట్రిప్( Longest Weekend Trip )ను ఎంజాయ్ చేయొచ్చు. మరి సెలవుల వివరాలు ఏంటో తెలుసుకుందాం.
జనవరి 10 నుంచి 9 రోజులు సెలవులు..!
జనవరి నెలలో ప్రధానంగా సంక్రాంతి పండుగ( Sankranthi Festival ) వస్తుంది. ఈ పండుగకు మూడు నుంచి నాలుగు రోజులు సెలవులు ప్రకటిస్తారు. ఈ సెలవులకు అదనంగా మరో నాలుగైదు రోజులు సెలవులు కలిసిరానున్నాయి. ఈ సెలవులు పిల్లలు, ఉద్యోగస్తులకు, సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్‌కు అందరికీ కలిసి రానున్నాయి. సెలవుల జాబితాను పరిశీలిస్తే.. జనవరి 10న రెండో శనివారం, మరుసటి రోజు ఆదివారం.. ఈ రెండు రోజులు కలిసి వస్తాయి. ఇక 12, 13 తేదీల్లో సెలవులు పెడితే.. మళ్లీ 18వ తేదీ వరకు అంటే 9 రోజులు సెలవులు కలిసి రానున్నాయి. ఈ లాంగెస్ట్ వీకెండ్‌ను జాగ్రత్తగా ప్రణాళిక చేసుకుంటే.. ట్రిప్‌ను ఎంజాయ్ చేయొచ్చు.
సెలవులు ఇవే..
జనవరి 10 : రెండో శనివారం
జనవరి 11 : ఆదివారం
జనవరి 12: స్వామి వివేకానంద జయంతి
జనవరి 14: భోగీ
జనవరి 15: మకర సంక్రాంతి
జనవరి 16: కనుమ
జనవరి 17: శనివారం
జనవరి 18: ఆదివారం
సొంతూరికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు..
ఈ తేదీలతో పాటు.. నెలలోని అన్ని ఆదివారాలు, రెండో శనివారం పాఠశాలలకు.. కొన్ని కార్యాలయాలకు వారాంతపు సెలవులు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజులు సెలవు తీసుకునే వారు ఉంటారు. మీరు కూడా అలాంటి వారు అయితే దానికి తగ్గట్లు సొంతూరికి ప్లాన్ వేసుకోవచ్చు.
