Maha Shivaratri Arts| మహాశివుడికి గిన్నీస్ రికార్డు కళాకారుల అద్బుత ఆరాధనలు!

మహా శివరాత్రి నేపథ్యంలో గిన్నీస్ బుక్ రికార్డు సాధకులైన కళాకారులు తమ అద్బుత సృజనతో శివయ్యను కొలిచిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

విధాత : మహా శివరాత్రి నేపథ్యంలో గిన్నీస్ బుక్ రికార్డు సాధకులైన కళాకారులు తమ అద్బుత సృజనతో శివయ్యను కొలిచిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలంగాణకు చెందిన జగిత్యాల జిల్లాకు చెందిన సూక్ష్మ కళాకారుడు, గౌరవ డాక్టరేట్, గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు గ్రహీత గుర్రం దయాకర్ మహా శివరాత్రి నేపథ్యంలో దబ్బనంపై శివయ్య విగ్రహాన్ని రూపొందించారు.
దబ్బనం అంచున నాగుపాము పడగ నీడలో కూర్చున్న శివయ్య విగ్రహాన్ని రూపొందించిన దయాకర్ కౌశలం ప్రశంసలు అందుకుంటుంది. దబ్బనంపై నాగేశ్వరుడిని రూపొందించడానికి దాదాపు 10 గంటల సమయం పట్టిందని తెలిపిన సూక్ష్మ కళాకారుడు దయాకర్ వెల్లడించారు.

శంఖుపై శివయ్య చిత్రం

ఏపీలోని నంద్యాల చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేశ్ అక్రిలిక్ పెయింటింగ్స్‌తో కూడిన అద్భుత సృజనతో మహా శివరాత్రి వేళ శంఖుపై మహాశివుడి అర్ధనారీశ్వర రూపాన్ని ఆవిష్కరించాడు. 5 గంటల పాటు శ్రమించి క్షీర సాగర మథన ఘట్టం, ద్వాదశ జ్యోతిర్లింగం, అర్ధ నారీశ్వర రూపం, శివ పార్వతుల కళ్యాణ ఘట్టాన్ని సూక్ష్మ రూపంలో ఆవిష్కరించాడు.

పూరీలో రుద్రాక్షలు, శివలింగాలతో మహాశివుడి సైకత ప్రతిమ

ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ మహాశివరాత్రి సందర్భంగా ఒడిశాలోని పూరీ బీచ్ వద్ద ఇసుకతో మరోసారి అద్భుతమైన శివుడి ప్రతిమను రూపొందించారు. శివుడి ప్రతిమ చుట్టూ 17,000 రుద్రాక్షలు, 500 చిన్న చిన్న శివలింగాలను ఏర్పాటు చేశారు. హరహర మహాదేవ..హ్యాపీ శివరాత్రి అంటూ కాప్షన్ ఇచ్చారు. ఈ సైకత శిల్పంలో ధ్యాన ముద్రలో ఉన్న శివుడు భ‌క్తుల‌కు ద‌ర్శ‌ించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. సముద్రపు అలల మధ్య ఈ మహాశివుడి సైకత రుద్రాక్ష, శివలింగాల మహా శిల్పం మరింత అందంగా క‌నిపిస్తూ, ఆధ్యాత్మిక వాతావరణాన్నిమరింత ద్విగుణీకతం చేస్తుంది. భక్తులు, సందర్శకులు, నెటిజన్లు సుద‌ర్శ‌న్ సైకత శిల్ప క‌ళ‌ను అభినందిస్తున్నారు.

 

Latest News