ఏడుకొండలు ఎక్కిన 116 ఏళ్ల వృద్ధురాలు!

కలియుగ వైకుంఠ దైవం తిరుమల వెంకటేశ్వరుడి దర్శనం కోసం ఓ శతాధిక వృద్దురాలు భారీ సాహసమే చేసింది. 116ఏళ్ల వయసులో తిరుమల ఏడు కొండలను కాలినడకను ఎక్కేసి శ్రీవారిపై తన అంచంఛల భక్తి ప్రపత్తులను చాటుకుని అందరిని అశ్చర్యపరిచింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Reported by: Y.V. Narsimha Reddy | జాతీయం | Jul 04, 2026, 12:03 pm IST
Read Time: 3 mins
ఏడుకొండలు ఎక్కిన 116 ఏళ్ల వృద్ధురాలు!

విధాత : కలియుగ వైకుంఠ దైవం తిరుమల వెంకటేశ్వరుడి దర్శనం కోసం ఓ శతాధిక వృద్దురాలు భారీ సాహసమే చేసింది. 116ఏళ్ల వయసులో తిరుమల ఏడు కొండలను కాలినడకను ఎక్కేసి శ్రీవారిపై తన అంచంఛల భక్తి ప్రపత్తులను చాటుకుని అందరిని అశ్చర్యపరిచింది.  ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. తమిళనాడుకు చెందిన బామ్మ తన కుటుంబ సభ్యుల చేయూతతో గోవింద నామస్మరణతో సుమారు 3,550 మెట్లు ఉన్న అలిపిరి నడక మార్గం ద్వారా కొండపైకి చేరుకున్నారు.

116 ఏళ్ల వృద్ధురాలు కాలి నడకన తిరుమల మెట్లు ఎక్కడం నిజంగా అసాధారణం, స్ఫూర్తిదాయకం అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక కాలంలో యువతకే తిరుమల కొండలపైకి కాలినడకన చేరుకోవడం కష్టతరమువుతున్న నేపథ్యంలో శతాధిక వృద్దురాలైన ఈ బామ్మ వయసును సైతం లెక్కచేయకుండా కాలినడకన తిరుమలకు చేరుకోవడం నిజంగా అధ్బుతం, అశ్చర్యకరం అని ప్రశంసిస్తున్నారు. శ్రీవారి పట్ల భక్తి మాత్రమే కాకుండా.. తన మనోబలం, శారీరక దృఢత్వ, నమ్మకంతో ఆ బామ్మ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపారని అభినందిస్తున్నారు. లగ్జరీ లైఫ్, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లకు అలవాటు పడిపోతున్న నేటి తరం యువతకు ఈ బామ్మ ఒక రియల్ రోల్ మోడల్, గొప్ప స్ఫూర్తి అని సోషల్ మీడియా వేదికలపై నెటిజన్లు కొనియాడుతున్నారు. ఇలాంటి వాళ్ళకి కదా VIP దర్శనం కల్పించాలని సూచిస్తున్నారు.