Peddi | ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో పెద్ది చిత్రం ఒకటి. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిత్రబృందం ఎలాంటి విరామం లేకుండా పని కొనసాగిస్తుండగా, ఇప్పటికే ఫస్ట్ హాఫ్ పూర్తి చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని, కుస్తీ పోటీల నేపథ్యంలో యాక్షన్ సీక్వెన్స్‌లు తెరకెక్కుతున్నాయని సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. త్వరలోనే రామ్ చరణ్ సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారని సమాచారం. అయితే ఈ రోజు పెద్ది చిత్ర దర్శకుడు బుచ్చిబాబు బర్త్ డే కాగా, ఆయనకి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే పెద్ది మూవీ యూనిట్ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో బుచ్చిబాబు ఒక రా అండ్ రస్టిక్‌ని వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు.ఈ సినిమా కేవలం పోటీ ఇవ్వడానికి రావడం లేదు. వెండితెరపై అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు వస్తుంది అంటూ వీడియోలో తెలియజేశారు. ఈ వీడియోతో పెద్ది చిత్రం ఊహలకి అందని విధంగా ఉంటుందని అర్ధం అవుతుంది. ఉప్పెనతో సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు ఇప్పుడు పెద్ది చిత్రంతో వండర్ సృష్టించనున్నాడని అంటున్నారు. ఏప్రిల్ 30న ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్‌లో విడుదల కానుంది.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న భారీ చిత్రమే “పెద్ది” సాలిడ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతుంది. ఈ సినిమా కేవలం క్రికెట్ ఆటగురించే కాకుండా అనేక క్రీడల నేపథ్యంలో ఉంటుంది అని ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఇక ప్రస్తుతం ఈ సినిమాలో మరో స్పోర్ట్ కి సంబంధించిన షూట్ జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. బుచ్చిబాబు అండ్ కో ఇప్పుడు కుస్తీ పోటీలపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సన్నివేశాలు అన్నీ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్టింగ్స్ లో చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సీన్స్ లో రామ్ చరణ్ లేకుండానే సాగుతున్నట్టు టాక్.
