MLC Kavitha | ED మూడో చార్జిషీట్.. ఫీనిక్స్‌ నుంచి భూమి కొన్న కవిత

MLC Kavitha ఆమె తరఫున డీల్‌ చేసిన బుచ్చిబాబు రాజకీయ నేత కావడంతో భారీ డిస్కౌంట్‌ తాజా చార్జిషీటులో ఈడీ ఆరోపణలు కవిత భర్త అనిల్‌ పేరు ప్రస్తావన విధాత: ఫీనిక్స్‌ గ్రూప్‌ సంస్థ నుంచి ఎమ్మెల్యే కవిత (MLC Kavitha) భూములు కొనుగోలు చేశారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తన తాజా చార్జిషీట్‌లో పేర్కొన్నది. శ్రీహరికి చెందిన ఫీనిక్స్‌ గ్రూప్‌ సంస్థ నుంచి ఒక స్థలాన్ని మెస్సర్స్‌ ఎన్‌గ్రోత్‌ క్యాపిటల్‌ పేరిట కొనుగోలు చేసినట్టు బుచ్చిబాబు మార్చి […]

  • Publish Date - May 1, 2023 / 01:40 PM IST

MLC Kavitha

  • ఆమె తరఫున డీల్‌ చేసిన బుచ్చిబాబు
  • రాజకీయ నేత కావడంతో భారీ డిస్కౌంట్‌
  • తాజా చార్జిషీటులో ఈడీ ఆరోపణలు
  • కవిత భర్త అనిల్‌ పేరు ప్రస్తావన

విధాత: ఫీనిక్స్‌ గ్రూప్‌ సంస్థ నుంచి ఎమ్మెల్యే కవిత (MLC Kavitha) భూములు కొనుగోలు చేశారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తన తాజా చార్జిషీట్‌లో పేర్కొన్నది. శ్రీహరికి చెందిన ఫీనిక్స్‌ గ్రూప్‌ సంస్థ నుంచి ఒక స్థలాన్ని మెస్సర్స్‌ ఎన్‌గ్రోత్‌ క్యాపిటల్‌ పేరిట కొనుగోలు చేసినట్టు బుచ్చిబాబు మార్చి 28న ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో వెల్లడించారని ఈడీ తన తాజా చార్జిషీటులో పేర్కొన్నది.

శ్రీహరి ఫీనిక్స్‌ కంపెనీకి సీవోవోగా ఉన్న సమయంలో ఈ కొనుగోలు జరిగిందని తెలిపారని పేర్కొన్నది. ఈ కంపెనీకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆమె భర్త డీఆర్‌ అనిల్‌కుమార్‌ ఎన్‌గ్రోత్‌ క్యాపిటల్‌లో భాగస్వాములని పేర్కొన్నది. ఎమ్మెల్సీ కవిత తెలంగాణ రాష్ట్రంలో పెద్ద రాజకీయ నాయకురాలు కావడంతో ఆ భూమి మార్కెట్‌ విలువ కంటే చాలా తక్కువకు కొనుగోలు చేశారని ఆరోపించింది.

25వేల చదరపు అడుగులు ఉన్న మరో ప్రాపర్టీని శ్రీహరి నుంచి కవిత కొనుగోలు చేశారని, ఆ డీల్‌ను బుచ్చిబాబు కవిత ఆదేశాల మేరకు పూర్తి చేశారని పేర్కొన్నది. మార్కెట్‌ విలువ ప్రకారం ఎస్‌ఎఫ్‌టీ రూ.1760 ఉంటే.. కవిత మాత్రం ఎస్‌ఎఫ్‌టీకి రూ.1260 మాత్రమే చెల్లించారని పేర్కొన్నది. ఆమె పెద్ద రాజకీయ నాయకురాలు కావడంతో శ్రీహరి ప్రాపర్టీ రేటు తగ్గించారని తెలిపింది.

Latest News